అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా ఈ టైంలో ఫేస్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
చర్మానికి సంబంధించిన పలు ప్రొడక్ట్స్ కూడా ఉపయోగిస్తుంటారు. అయితే అమ్మాయిలే కాదు స్కిన్ సంరక్షణ కోసం అబ్బాయిలు కూడా చర్మంపై ఫోకస్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే అమ్మాయిలా కన్నా ఎక్కువగా అబ్బాయిలే బయట తిరుగుతుంటార. కాదా ఈ క్రమంలో ఫేస్ పై దుమ్ము, ధూళి పెరిగిపోయి... జిడ్డుగా మారిపోతుంది. కానీ కొంతమంది అబ్బాయిలు ఈ జిడ్డును తొలగించడానికి కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోరు. దీంతో ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అంతేకాకుండా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తాజాగా నిపుణులు చెప్పినవి పాటిస్తే చాలు.
ఫేస్ జిడ్డు బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజు ఫేస్ వాష్ తో ఫేస్ కడగాలి. తరువాత క్రీమ్ ఫేస్ కు రాసుకోవాలి. వీలైనప్పుడల్లా పలు రకాల ఫేస్ మాస్కులు వాడాలి. దీంతో ఫేస్ కలర్ మారకుండా ఉంటుంది. అంతేకాకుండా ముఖంలో గ్లో వస్తుంది. స్కిన్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అలాగే పలు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ లను కూడా అప్లై చేయడం మేలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ తేనే తీసుకోవాలి. తగినంత వాటర్, ముల్తాన మట్టి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అప్లై చేసే విధానం చూసినట్లయితే.. ముందుగా ముల్తానీ మట్టి తీసుకుని వాటర్ పోసి కలుపుకోవాలి. ఐదు నిమిషాలు అయ్యాక ఒక టీ స్పూన్ తేనె యాడ్ చేయాలి. తరవాత దీని మెడకు, ఫేస్ కు అప్లై చేసి.. 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో కడిగితే జిడ్డు వదులుతుంది.