లైఫ్ స్టైల్: ఇంట్లో బొద్దింకలా.. ఇలా చేస్తే దెబ్బకు పరార్..!
ముందుగా బొద్దింకలకు పసుపు రంగు అంటే చాలా ఇష్టపడతాయట. అందుకే ఆ రంగు కలిగిన వాటిని ఆకర్షిస్తాయట. ఆ రంగు కలిగిన పదార్థాలు కిచెన్ వైపు ఉండకపోవడమే మంచిది. ఏవైనా డబ్బాలు కూడా ఆ కలర్ లో ఉంటే వాటిని దాచేయడం మంచిది.
దోసకాయల ముక్కలను తిన్న తర్వాత కొన్నిటిని కిచెన్ లో పెట్టడం వల్ల ఆ వాసనకి అవి బయటకు వెళ్ళిపోతాయి.
బోరిక్ పౌడర్ ఎన్నోవాటికి ఉపయోగిస్తూ ఉంటాము.. అయితే వీటిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లితే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి.
నూనె వస్తువులు నూనె ఆహారాలు ఏవైనా సరే కింద పడకుండా చూసుకోవాలి. ఇవి కింద పడితే బొద్దింకలు ఈ వాసనకు ఆకర్షించి వస్తాయట. అందుకే ఇలాంటి ఆహార పదార్థాలను కింద పడకుండా చూసుకోవాలి.
మొక్కజొన్న పిండి ,చక్కెర పొడిని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట పెట్టడం వల్ల ఆ మిశ్రమాన్ని తిన్న వెంటనే బొద్దింకలు మరణిస్తాయట.
కిచెన్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా ఒకే చోట వంట పాత్రలను పెట్టరాదు ఇలా పెట్టడం వల్ల అవి వాసనను బట్టి ప్రతిరోజు వస్తూ ఉంటాయి అందుకే పాత్రలను మార్చడం చాలా మంచిది.
బొద్దింకలు ఎక్కువగా సింక్ ఉండే చోట కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అందులో ఎలాంటి ఆహార పదార్థాలను ఉండకుండా శుభ్రం చేసుకోవాలి.