బి కేర్ ఫుల్... సిగరెట్ కాలుస్తూ టీ ను తాగుతున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే..!

lakhmi saranya
ఉదయం లెగిసిన వెంటనే టి అనేది తాగకపోతే అసలు రోజే గడవదు కొంతమందికి. టీ తాగుతూ మరికొంతమంది సిగరెట్టును కూడా కాలుస్తూ ఉంటారు. టీ తాగుతూ సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికిమంచిది కాదు. చాలా మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ క్షణాన్ని సిగిరెట్ ప్రియులు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు. పనిలో అలసిపోయి రిఫ్రెష్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ రకంగా సిగరెట్ తాగే వారు ప్రస్తుత రోజుల్లో ఎక్కువైపోయారు. కానీ స్మోక్ చేస్తూ టీ తాగటం ఎంత పెద్ద రిస్కో గ్రహించలేకపోతున్నారని తాజాగా ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
 ఆ అలవాటు ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు సంబంధించి తలెత్తుతాయి. సాధారణ వ్యక్తుల కంటే స్మోక్ చేసే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ మూడు రెట్లు ఎక్కువ. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రీసెంట్ గా ఒక పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. టీ లో ఉన్నటువంటి టాక్సిన్ సిగరెట్ పొగలో కలిస్తే చాలా ప్రమాదకరం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ఉదా... జ్ఞాపక శక్తి చేతులు, కాళ్లలో గ్యాంగ్రిన్ కోల్పోవడం, గుండె, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ,
ఊపిరితిత్తుల్లో కుంచించుకుపోవడం, సంతానలేమి సమస్య, కడుపులో పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మనం రెండు కలిపి తీసుకోవడం వల్ల ప్రమాదం అని తెలుస్తోంది. టీ తాగాక కొంతసేపు గ్యాప్ ఇచ్చాక అప్పుడు సిగరెట్ కాలవచ్చు. రెండు వెంట వెంటనే చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరం. మరి ఎక్కువగా సిగరెట్ కాల్చే వారికి గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిగరెట్ను తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. సిగరెట్లు చెడు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సిగరెట్ ను తాగితే లివర్ లేదా కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: