ఆయిల్ లేకుండా వీటితో టేస్టీ చికెన్ ఫ్రై రెట్టింపు రుచి పక్కా‌..!

lakhmi saranya
ప్రస్తుత కాలంలో నాన్వెజ్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగకుండా ఉంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ ఎలా ఉండాలో తెలుసా. చికెన్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆదివారం వస్తే చాలు అందరి ఇంట్లో చికెన్ తప్పక ఉండాల్సిందే. కొంతమంది కేవలం ఆదివారం మాత్రమే చికెన్ తింటే.... మరి కొంతమందికి వీక్ లో నాలుగైదు సార్లు తింటుంటారు. ముక్క లేనిదే వారికి ముద్ద దిగదనుకోండి. ఇక అందులో చికెన్ ఫ్రై అంటే పిచ్చిగా ఇష్టపడుతుంటారు. అయితే కామన్ గా చికెన్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ ఉండాలి. కానీ మొత్తమే ఆయిల్ లేకుండా చికెన్ వేపుడు ఎలా చేయాలో తెలుసుకోండి. రుచి అదిరిపోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ఆయిల్ యూస్ చేసి వన్డే చికెన్ కన్నా రెట్టింపు రుచినిచ్చే చికెన్ ఫ్రై తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.. కిలో చికెన్ ముక్కలు, రెండు ఉల్లిపాయలు, కొబ్బరి పాలు - అరకప్పు, సరిపడా కరివేపాకులు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయలు – రెండు, అర స్పూను పసుపు, కారం - మూడు స్పూన్లు, నువ్వు చిట్టి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి - రెండు, 5 లవంగాలు, దాల్చిన చెక్క - రెండు ముక్కలు, మిరియాలు - నాలుగు, జీలకర్ర, ధనియాలు - మూడు స్పూన్లు, 5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం - ఒక ముక్క, యాలకులు – మూడు, నిమ్మరసం తీసుకోండి. ముందుగా యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర,
 ధనియాలు మిక్స్ పట్టుకోండి. దీనిలోనే వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు వేసి మళ్లీ మిక్సీ పట్టి... ఈ కృష్ణమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి. తరువాత చికెన్ ను కడిగి .. చికెన్ లో పసుపు, ఉప్పు,కారం, నిమ్మరసం, మసాలా పేస్ట్ వేసి 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి... కడాయిలో కొబ్బరి పాలు పోయండి. కొబ్బరి పాలు మరిగాక అందులో చికెన్ వేసి మూత పెట్టాలి. 20 నిమిషాలయ్యాక మసాలా పేస్ట్ వెయ్యండి. దగ్గరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఆయిల్ లేకుండా కొబ్బరి పాలతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చికెన్ లో ప్రోటీన్, కొబ్బరి పాలలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. అలాగే కొబ్బరి పాలతో వండిన ఏ వంటకం అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: