వానా కాలంలో దొరికే ఈ పండ్లు భయంకర జబ్బులని దరి చేరనివ్వవు?

Purushottham Vinay

వానా కాలంలో దొరికే ఈ పండ్లు భయంకర జబ్బులని దరి చేరనివ్వవు?  

ఈ సీజన్ లో దొరికే వాక్కాయ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. భయంకరమైన జబ్బులు రాకుండా వాటిని ఈజీగా దూరం చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మురుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం వల్ల సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అలాగే వాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం దీన్ని ఉపయోగించేవారు. పైగా ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.అలాగే ఈ వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది. 


మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకారి వాక్కాయ. దంతాలు పుచ్చిపోకుండా చేయడమే కాదు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది. వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఇది వగరుగా, పుల్లగా ఉంటుంది. కానీ, తరచూగా తింటూ ఉంటే.. మూత్రపిండాలలో రాళ్ళని సైతం కరిగించే శక్తి ఈ వాక్కాయకు ఉంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఈ వాక్కాయ అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి.వాక్కాయలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, ఫైబర్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, అంథోసైనిన్స్‌, ఫినోలిక్‌ యాసిడ్స్‌ అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ పాలిఫినల్స్‌ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.వాక్కాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఉదర సమస్యలను నివారించడానికి ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: