ఇంట్లోకి పురుగులు, బల్లులు, బొద్దింకలు రాకుండా ఇలా చెయ్యండి?
దాల్చిన చెక్క నూనె : దాల్చిన చెక్క ఇంట్లో వివిధ రకాల పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది.పరుగులు, బొద్దింకలు ఇంకా బల్లులకు రెపలెంట్ గా పనిచేస్తుంది. 4 ఔన్సుల నీటికి 1/4 టీస్పూన్ ఈ నూనె కలిపి మిశ్రమాన్ని చర్మం, దుస్తులు, ఇంటి పరిసరాల్లో పిచికారీ చేస్తే వీటి బెడద ఉండదు.
గ్రీక్ క్యాట్మెంట్ ఆయిల్ : పుదీనా కుటుంబానికి చెందిన క్యాట్నిప్ నె పెటా పర్నాసికా వివిధ రకాల పురుగులని దూరం చేస్తుంది. ఈ మొక్కల నూనె 2 నుంచి 3 గంటల వరకు అనేక రకాల పురుగులను సమర్థవంతంగా తిప్పికొట్టగలవు.
థైమ్ ఆయిల్ : ఇంట్లో ప్రాణంతకమైన పురుగులను తరిమి కొట్టడానికి థైమ్ ఆయిల్ ఉత్తమమైనది. థైమ్ ఆకులను కాల్చడం వల్ల 60 నుంచి 90 నిమిషాల వరకు కీటకాల బెడద ఉండదు. ఓ టీ స్పూన్ ఆలివ్ లేదా జోజోబా ఆయిల్ కు 4 చుక్కల థైమ్ ఆయిల్ కలపండి.
సోయాబీన్ నూనె :సోయాబీన్ ఆధారిత ఉత్పత్తులు పురుగుల సమస్యల నుంచి దీర్ఘకాలిక రక్షణను అందిస్తాయి. సోయాబీన్ నూనెతో పాటు, లెమన్రాస్ నూనెను కూడా పురుగుల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది.
సిట్రోనెల్లా : సిట్రోనెల్లా అనేది పురుగులను వికర్షించే సహజమైన నూనె. సిట్రోనెల్లా కొవ్వొత్తులు ప్రభావంతంగా పనిచేస్తాయి.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ లేదా మెలలూకా ఆయిల్.. క్రిమినాశక, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.
వేపనూనె : వేప నూనె దోమల వికర్షకంగా సహజమైన ప్రత్యామ్నాయం. 50 నుంచి 100 మిల్లీలీటర్ల వేపనూనెకు నీటిని కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుంటే ఏ పురుగు రాదు.
కర్పూరం వెలిగిస్తే: పురుగులతో పురుగుల వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బదులుగా, ఇంట్లో కర్పూరాన్ని వెలిగించవచ్చు ఇది మంచి సువాసన ఇస్తుంది. అయినా కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో పెద్దగా పొగ రాదు. ఈ పొగకు దోమలతో సహా అన్ని పురుగులు పారిపోతాయ్. పైగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా కర్పూరం ఎంతో మేలు చేస్తుంది.
ఇంటి చుట్టూ మొక్కలు ఉంటే దోమల బెడద ఇంకా అలాగే అనేక రకాల పురుగులు, బొద్దింకల బెడద కూడా మరింతగా పెరుగుతుంది. కాబట్టి సకాలంలో ఇంట్లో కానీ ఇంటి బయట కానీ కలుపు మొక్కలు ఉంటే వెంటనే ఆ కలుపు మొక్కలను తొలగించడం చాలా మంచిది. ముఖ్యంగా ఇంటికి నాలుగు వైపులా ఎక్కడా నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి పురుగులు కానీ, దోమలు కానీ రానే రావు.