బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా?.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
ఒకేసారి ఎక్కువ బిస్కెట్లు తినడంతో జీర్ణ సమస్యలు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మలబద్ధకం మరియు అజీర్తి వంటి సమస్యలు వచ్చే ప్రభావం ఉంది. బిస్కెట్లు రుచిని పెంచేందుకు కొంత మంది ఎమల్సిఫైర్స్ వంటి రసాయనాలు వాడుతారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అనేక చెడు పౌడర్స్ ని వాడుతూ ఉంటారు. వీటిని తింటే పాలు సమస్యలు వస్తాయి. క్రీం బిస్కెట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు బ్యూటీ లేటెడ్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి శరీరానికి చాలా హానికరం. వీటి ప్రభావం జీర్ణ వ్యవస్థ పై ఉంటుంది. టీతో పాటు బిస్కెట్లు తింటే హై బీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. బిస్కెట్లలో ఉండే సోడియం కంటెంట్ బిపిని పెంచుతుంది. ఇది గుండె సమస్యలకు కారణం అవుతుంది కూడా.
బిస్కెట్ ని తరచూ తినడం ద్వారా డయాబెటిస్ వంటి సమస్యలు కూడా దరి చేరుతాయి. డయాబెటిస్తో బాధపడేవారు బిస్కెట్స్ ని అసలు తినకూడదు. వీటిని తినడం ద్వారా మరింత ఆరోగ్యం చెడిపోతుంది. వారానికి ఒకటి రెండు సార్లు తినడం పర్లేదు కానీ ప్రతిరోజు బిస్కెట్లు తింటే మాత్రం వారి హెల్త్ షెడ్డు కి వెళ్లిపోయినట్లే. ఏదో ఇప్పటికే చాలామంది నిపుణులు బిస్కెట్లను తరచూ తినవద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు ఈ బిస్కెట్స్ ని తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్నపిల్లలకి ఈ బిస్కెట్లను అసలు పెట్టకూడదు.