బ్లాక్ గ్రేప్స్ తింటే ఇన్ని లాభాలా..!!

Divya
సాధారణంగా మనకి ఎక్కువగా దొరికేటువంటి పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి.. ముఖ్యంగా నల్ల ద్రాక్ష గతంలో ఎక్కువగా తినే వారు ప్రస్తుతం గ్రీన్ కలర్ ద్రాక్ష ఎక్కువగా దొరుకుతొంది.అయినప్పటికీ కూడా నల్ల ద్రాక్షని చాలామంది తింటూనే ఉన్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని కాపాడుతాయని.. అందుకే ఈ పండ్లను తినడం వల్ల చిన్న చిన్న ఒత్తిడి నుంచి కూడా బయటపడవచ్చట.

ఈ బ్లాక్ గ్రేప్స్ లలో ఎక్కువగా విటమిన్-C అనేది ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుందట.అదేవిధంగా ఇందులో ఉండేటువంటి మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం వంటివి ఎముకలు వీక్ కాకుండా చేస్తాయి. బోలు ఎముకల సమస్య కూడా రాకుండా చేస్తాయట. ఈ నల్ల ద్రాక్షలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ ని సైతం బ్యాలెన్స్గా ఉండేలా చూస్తాయి. దీంతో కొంతవరకు క్యాన్సర్ వంటి వాటిని దగ్గరకు రానివ్వకుండా చేస్తాయట.

అందుకే నల్ల ద్రాక్షని తినడం మంచిదని చెప్పవచ్చు. నల్ల ద్రాక్షలో  జిమాక్సిన్ ,లూటిన్ వంటి సమ్మేళనాలు కలిగి ఉండడం వల్ల ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి కంటి సంబంధిత సమస్యలను కూడా తగ్గించడానికి ఈ నల్ల ద్రాక్ష ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా కంటిలో ఉండేటువంటి పొరల పైన ఎలాంటి ప్రభావం చూపకుండా చేస్తాయి.
నల్ల ద్రాక్షలో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల ఇది జీర్ణక్రియ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.. క్యాలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేటువంటి ఫైబర్ ఈ నల్ల ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీటిని తిన్నవారికి ఆకలి అనేది వేయదు... అతిగా తినకుండా బరువు తగ్గాలనుకునేవారు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: