కాయగూరల జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం బేష్..!!

Divya
మనం ప్రతిరోజు చూసేటువంటి పండ్లు ,కాయగూరలలో ఎన్నో రకాల పోషకాలు విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.. అయితే పచ్చి కాయగూరలలో కూడా కొన్ని రకాల కోషకాలు ఉంటాయని వాటిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

క్యారెట్:
క్యారెట్లో ఎక్కువగా విటమిన్- A, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్లను కూర చేసుకొని తినడమే కాకుండా జ్యూస్ రూపంలో కూడా చేసుకొని తాగితే కంటి అనారోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది.

పాలకూర:
ఆకుకూరలలో ఎన్నో పోషకాలు ఉంటాయని కూడా చెప్ప వచ్చు. పాలకూరల లో ఎక్కువగా ఐరన్ క్యాల్షియం మెగ్నీషియం వంటి వి పుష్కలంగా లభిస్తాయి. పాలకూరను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మంచి బలాన్ని అందిస్తుంది.
సిలేరి:
సిలేరి అనే ఆకుకూర చూడడానికి కొత్తి మీర లాగా ఉన్నప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు ఈ జ్యూస్ ని తాగడం వల్ల తక్కువ సమయంలోనే బరువుని తగ్గుతారు. ఇందులో ఉండే విటమిన్-k, పొటాషియం పోలేటువంటివి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.

కీర దోసకాయ:
 వేసవి కాలంలో శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండేందుకు కీరదోస చాలా సహాయ పడుతుంది.అలాగే ఇందులో ఉండే విటమిన్-k,c వంటివి రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి .అలాగే చర్మం అందంగా కనిపించడానికి కూడా ఈ కీరదోస ఉపయోగపడుతుంది.

బీట్రూట్:
బీట్రూట్ రక్తహీనత తో ఇబ్బంది పడేవారు వీటిని ఏ రూపంలో అయినా తినవచ్చు. ముఖ్యంగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఇందులో ఉండే పొటాషియం మాంగనీస్ ఐరన్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
క్యాప్సికమ్:
క్యాప్సికమ్ ను కూడా జ్యూస్ చేసుకొని తాగ వచ్చు.. ముఖ్యంగా ఇందులో రకరకాల క్యాప్సికంస్ కూడా ఉంటాయి. వీటిని కూడా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ఇందు లో ఉండే పోషకాలు సైతం క్యాన్సర్ను నివారించడానికి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: