సమ్మర్ లో శరీరాన్ని చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి?

Purushottham Vinay
ఎండా కాలం వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతాయి. శరీరం అలసిపోవడం చర్మం ఎక్కువగా పొడిబారిపోవడం జరుగుతుంది.కొంతమంది వడ దెబ్బకి గురౌతూ ఉంటారు.కొంతమందికి జుట్టు కూడా రాలిపోతు ఉంటుంది.మరి ఈ సమస్యలు ఎక్కువ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని అరికట్టవచ్చు.అవేంటో చూద్దాం. సమ్మర్ లో ఎక్కువ వాటర్ తీసుకోవడం మంచిది.వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో మంచిది.పుచ్చకాయ తినడం వళ్ళ శరీరం చల్లబడుతుంది.అందుకే ఎక్కువగా ఎండా కాలంలో పుచ్చకాయని తింటూ ఉంటారు.సొరకాయ,పొట్లకాయ, బీరకాయ,వంటి కూరగాయలు తినటం వల్ల ఎంతో మంచిది. తాజా ఆకు కూరలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. విటమిన్ C ఉన్న పండ్లని కూరగాయల్ని తింటే శరీరానికి ఎంతో మేలు.మూడు పూటలా భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.రోజుకి  ఒక్కసారైనా పెరుగుతో భోజనం తినాలి.


రోజు మార్చి రోజు నిమ్మకాయ రసం చేసుకుని తాగాలి.ఇలా తాగటం వల్ల శరీరానికి, జుట్టు రాలే సమస్యకు ఎంతో సహాయపడుతుంది. పెరుగు నిమ్మకాయ కలిపి తలకు ప్యాక్ లా పెట్టుకోవడం వల్ల తలలో వేడి తగ్గి ప్రశాతంగా ఉంటుంది.ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.ఆరంజ్ జ్యూస్ తాగడం వల్ల బాడీ కి విటమిన్ C ఎక్కువగా అందుతుంది.డైలీ ఓక గ్లాసు ఆరంజ్ జ్యూస్ తాగడం మర్చిపోకండి.కొంతమంది ఏ కాలంలోనైనా సరే వేడి నీళ్లతో స్నానం చేస్తారు. అయితే ఎక్కువగా వేడి నీళ్ల స్నానం అంత మంచిది కాదు అని చెప్తున్నారు కొంతమంది నిపుణులు.ఎండా కాలంలో చల్ల నీళ్లతో స్నానం చాలా మంచిది.ఇలా చేయడం వల్ల శరీరంలో వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.డీఫ్రై వేపుడులకి కొంచెం దూరంగా ఉండటం మంచిది.ఎక్కువగా మసాలతో తయారు చేసిన పదార్ధాలని తీసుకోక పోవడం మంచిది.ఎక్కువగా నాన్వెజ్ తినడం కూడా సమ్మర్ లో అంత మంచిది కాదు.మరీ తీనాలనిపిస్తే మటన్ తినడం మంచిది మటన్ తినడం వల్ల శరీరం చలువ చేస్తుంది.ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎండా కాలంలో వచ్చే ఇబ్బందులని తట్టుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: