రొయ్యలతో నోరూరించే స్నాక్స్.. ఆ రుచే వేరు?

Purushottham Vinay
రొయ్యలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు.కొంత మంది రొయ్యలు టమాట కర్రీ అని మరికొందరు రొయ్యల వేపుడు అని చేసుకొని తింటూ ఉంటారు.కానీ ఈ రొయ్యలతో ఎప్పుడైనా వెరైటీ గా చేసిన స్నాక్స్ తిన్నారా?రొయ్యలతో ఎప్పుడూ ఒకే రకమైన కర్రీ కాకుండా కొంచెం వెరైటీగా చేద్దాం.మిక్సీ జారులో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు,నాలుగు పచ్చిమిర్చి,గుప్పెడు కరివేపాకు,కొంచెం అల్లం ముక్క,ఆరు వెల్లుల్లి రెబ్బలు,వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసి ఆ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు గిన్నెలో నూనే వేసుకొని వేడి అయ్యాక పావుకేజి బాగా క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు నూనెలో వేసి కొంచెం పసుపు,ఉప్పు వేసి బాగా కలిపాక కాసేపు ఈ రొయ్యలని మగ్గనివ్వాలి.తర్వాత రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం పోయాక అందులో నూనే పైకి తేలే వరకు రొయ్యలని వేపుకోవాలి.తర్వాత ఒక గిన్నెలో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక రెండు కోడిగుడ్లు పగలగొట్టి బాగా కలిపి రొయ్యల ముక్కలలో పోయాలి.


ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కుడా ఇందులో వేయాలి.అందులోనే తగినంత ఉప్పు,గరం మసాలా పొడి,మిరియాల పొడి  వేసి చేతితో బాగా ముక్కలన్ని కలిసేటట్టు మెత్తగా మెదుపుకోవాలి.అందులోనే కొంచెం మొక్కజొన్న పిండి,ఒక కప్ బ్రెడ్ తో చేసుకున్న పొడిని కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి.ఇలా చేసిన పిండిని బాల్స్ ల రౌండ్ గా చేసుకొని,బ్రెడ్ పొడిలో బాల్స్ ని వేసి బాల్స్ కి బ్రెడ్ పొడి మొత్తం పట్టేలా అటు ఇటు తిప్పి బాల్స్ ని పక్కన పెట్టుకోవాలి.తర్వాత డీఫ్రై కి బాల్స్ మునిగే వరకు నూనే పోసుకొని బాగా కాగాక బాల్స్ వేసి ఏడు ఎనిమిది నిముషాలు సన్నని మంటతో డీఫ్రై చేసుకుని మంచి ఎరుపురంగు వచ్చాక బాల్స్ ని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రొయ్యల బాల్స్ ని టమాటో సాస్ తో అద్దుకొని తింటుంటే ఉంటుంది అబ్బో చెప్తే ఆ రుచి తెలీదు,తింటేనే తెలుస్తుంది.మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రొయ్యల బాల్స్ ని ట్రై చేసి తినండి.ఒక్కసారి వీటి టేస్ట్ తెలిసాక మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: