సంతాన సమస్యలకు చెక్ పెట్టే ఆహారం?

Purushottham Vinay
సామలు చిరు దాన్యాలలో ఇది కూడా ఒకటీ. వీటిని ఇంగ్లీషులో  లిటిల్ మిల్లెట్( Little Millete) అని పిలుస్తారు. వీటిని తినడం వల్ల షుగరు బీపీ గుండెకి సంబందించిన సమస్యలు మాత్రమే తగ్గుతాయనీ తెలుసు కానీ వీటిని ప్రతిరోజు ఆహారంలో బాగంగా తీసుకుని తింటే సంతానం లేక బాధపడే దంపతులకు వారి కల నిజమౌతుందని మీకు తెలుసా? ఎలా అంటారా? వీటీని తినడం వల్ల ఎలాంటి ఉపయోగాల కలుగుతాయో తెలుసుకుందాం.


సామాలు రోజు ఆహారంలో తీసుకోవటం వల్ల ఆడవారిలో నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది అని మీలో ఎంతమందికి తెలుసు? కొంత మంది ఆడవాళ్ళు PCOD, PCOS, థైరాయిడ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  ఐతే వీటిని తినటం వల్ల నెలసరి క్రమంగా వస్తుంది. నెలసరి సరిగ్గా రాకపోవడము వల్లే ఈ PCOD,PCOS థైరాయిడ్ రావడానికి గల కారణం. ఈ సామలని పలు విధాలుగా ఆహారంలో తీసుకోవచ్చు సామలు పిండిచేసి ఆ పిండితో జావ చేసుకొని ప్రతి రోజు ఉదయాన్నే తాగడం వల్ల నెలసరి క్రమంగా వస్తుంది. ఇడ్లీ రవ్వ గా కూడా తీసుకోవచ్చు ఈ ఇడ్లీలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవటం వల్ల థైరాయిడ్ నుండి విముక్తి చెందొచ్చు. వీటిని రైస్ లా వండి తినొచ్చు దీని వల్ల PCOD, PCOS సమస్య నుండి త్వరగా ఫలితాన్ని  పొందుతారు. 


మగవారిలో రోజు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్లా స్పెర్మ్ కౌంట్ చాలా వరకు పెరుగుతుంది. మగవారిలో ఇప్పుడు తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల ఓవర్ హీట్ బాడీ ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. బార్య భర్తలు ఇరువురు ఈ సామలు రోజు ఆహారం లో తీసుకుంటే వెంటనే తల్లి తండ్రులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మన పెద్దల కాలం లో ఎక్కువ ఈ సామలు తినే వారు. అందువల్ల అప్పటి వారికి సంతానం  అయిదుగురు కన్న తక్కువ ఉండెవారు కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటిని ఆహారంగా తీసుకోండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: