రోజు అరస్ఫూన్ తిప్పతీగా చూర్ణం తీసుకుంటే ఇన్ని లాభాలా..?

Divya
ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చే వరకు మన ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ ఉండదు.ఒకవేళ సమస్యలు వచ్చినప్పటికీ కూడా పోలోమని డాక్టర్ దగ్గర పరిగెత్తి రసానిక మందులు వాడటానికి ట్రై చేస్తాము.కానీ మన పూర్వం నుంచి అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద మందులు మాత్రం అస్సలు తీసుకోము.ఇంకా చెప్పాలి అంటే వాటిపట్ల మనకి ఎక్కువ నిర్లక్ష్యం కూడా.కొన్ని రకాల ఆకులు చూడ్డానికి పిచ్చి ఆకుల వల్లే కనిపిస్తాయి. కానీ వాటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అలాంటి కోవలోకి వస్తుంది తిప్పతీగ. ఇలాంటి తిప్పతీగను చూర్ణం చేసి రోజుకు అర స్ఫూన్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తూ ఉన్నారు.అవేంటో మనము చూద్దాం పదండి..
సాధారణంగా తిప్పతీగ మనకు దొరకకపోతే, ఆయుర్వేద మందుల షాపుల్లో  పొడి కనిపిస్తూ ఉంటుంది.మరియు తక్కువ ఖర్చులో కూడా లభిస్తుంది. ఈ తిప్పతీగ చూర్ణం కోసం ఆ పొడిని అరస్ఫూన్ తీసుకొని రెండు మిరియాలు,ఒక స్పూన్ తేనె అందులో కలిపి రోజు పరగడుపున తీసుకోవాలి.ఇలా నెలరోజులపాటు చేశామంటే చాలు అందులో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలన్నీ పొందవచ్చు.
 ఇందులో ముఖ్యంగా తిప్పతీగ సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కళంగా కలిగి ఉంటుంది.ఇది వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి ముందు ఉంటుంది. మరియు యాంటీ-పైరేటిక్ స్వభావం కలిగి ఉండటంతో విష జ్వరాలకు విరుగుడుగా పనిచేస్తుంది.చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు.అలాంటి వారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మన శరీరానికి సహాయపడుతుంది.జలుబు,దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
అంతేకాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహం రాకుండా కాపాడుతుంది. హెపటైటిస్,ఆస్తమాగుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.శ్వాస ఆడకపోవడం,ఛాతీ బిగుతుగా ఉండడం,గురక,దగ్గు, వంటి లక్షణాలను నుంచి తిప్పతీగ స్వాంతన కలిగిస్తుంది.
తిప్పతీగ చూర్ణం స్త్రీ లలో అధికంగా వచ్చే బోలు ఎముకల వ్యాధిని పారద్రోలుతుందని మాట్యురిటాస్‌లో ప్రచురితమైన ఒక నివేదిక స్పష్టం చేసింది.మానసిక ఆందోళన,ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ తీసుకోవడం చాలా మంచిది.తిప్పతీగతో పచ్చ కామెర్లును నయం చేయవచ్చు.
 
కానీ శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు,గర్బిణీలు, పాలిచ్చే తల్లులు,చిన్న పిల్లలు తిప్పతీగకు దూరంగా ఉండటం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: