షాంపుతో ఇలా చేశారంటే ఇంటి నుంచి ఎలుకలు పరార్..!!
దీనికోసం ముందుగా ఒక గుడ్డ ముక్కను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి,ఒకటిన్నర చెంచాల గోధుమ పిండి,2 కర్పూరం ముక్కలు,కారపు పొడి,మరియు ఒక షాంపూ ఎలుకల నివారణకు సిద్ధం చేసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో ఒకటిన్నర చెంచా మైదా తీసుకుని అందులో కొద్దిగా ఎర్ర కారం,నీళ్ళు కలపాలి.ఇప్పుడు మీరు స్టోర్‌లో లభించే షాంపూ సాచెట్‌లోని షాంపూని కలపాలి.
ఇప్పుడు ముందుగా తీసుకున్న గుడ్డ ముక్కకు పైన తయారు చేసుకున్నావ్ మిశ్రమాన్నిఅప్లై చేయాలి.ఆ తరువాత ఆ గుడ్డ ముక్కపై కర్పూరం పొడిని స్ప్రే చేయాలి.ఇదంతా కేవలం చేతులకు గ్లౌజ్ వేసుకొని మాత్రమే చేయాలి లేకుంటే అనవసరమైన దుష్ప్రభావాలు కలుగుతాయి.
ఈ గుడ్డ ముక్కలను తీసుకువెళ్లి ధాన్యం నిలువున్నచోటను సింక్ దగ్గర, డ్రైనేజ్ పైపులు దగ్గర, చెత్తబుట్టల దగ్గర ఉంచాలి.ఎందుకంటే ఎలుకలు ఎక్కువగా ఈ ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటాయి. సాధారణంగా గోధుమపిండి తినడానికి ఎలుకలు వస్తాయి.ఒకవేళ ఆ గుడ్డ ముక్క కోన్న గోధుమ పిండి నాకినప్పుడు కారం, షాంపూ మరియు కర్పూరం ఉంటుంది.కనుక వాటికీ మండుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో వాటికి ఎక్కడ నీరు దొరకకపోతే చలో అంటూ బయటికి వెళ్లిపోతాయి.
వీటితోపాటు ధాన్యం నిలువున్న మూటల పక్కన మిథైల్ బాల్స్ ను ఉంచడం వల్ల కూడా ఎలకలు దరి చేరవు.మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటూ ఉంటే,వెంటనే ఈ చిట్కాని మీకుటుంబ సభ్యులతో షేర్ చేయండి.