రాగి సంగటి ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి..!

Divya
రాగి సంగటి అంటే రాయలసీమ, కర్ణాటక వంటకాల్లో అత్యంత ఫేమ‌స్ అయిన వంట‌కం.దీనిని రాయలసీమ ప్రాంతాల్లో రాగి ముద్ద అనికూడా అంటారు. ఈ రాగి సంగటిని ఆరు నెలల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి తాత వరకు ఇష్టంగా,ఈజీగా తినే వంటకాలు రాగి సంగటి ఒకటి.మరియు రాగి ముద్దతో నాటుకోడి పులుసు తింటే ఈ జన్మకు ఇంతే చాలు అనిపిస్తుంది. అలాంటి రాగి ముద్దను రాగుల‌తో చేయడంతో అది రుచిని అందించడమే కాక ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది.ఉదయాన్నే అల్పాహారంలో రాగి ముద్దను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.రాగి ముద్దతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో మనము తెలుసుకుందాం పదండి..
రాగిముద్దను తరచూ తీసుకోవడం వల్ల ఇందులో పుష్కలంగా లభించే క్యాల్షియం ఎముకల‌ను, కండ‌రాలు,దంతాల‌ను దృఢంగా,బలంగా తయారవడానికి సహాయపడుతుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు.అలాంటి వారు వైట్ రైస్ బదులుగా,ప్రతిరోజు రాగి సంగటి చేసుకొని తినడం వల్ల,ఇందులో ఉన్న అధిక ఫైబర్ జీర్ణశక్తిని పెంచడమే కాకుండా,అధికంగా తినాలనే కోరికను కూడా నిరోధిస్తుంది.దీనితో తొందరగా బరువు తగ్గడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.రాగి సంగ‌టి ప్ర‌తి రోజు తిన‌డంతో ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కూడా ఈజీగా కరిగించి,గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.
ఈమధ్య కాలంలో పదిమందిలో ఏడు మంది చిన్న వయసులోనే డయాబెటిస్ కి గురవుతున్నారు. అలాంటివారు రైస్ స్కిప్ చేయడానికి రాగి ముద్ద ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.మధుమేహంతో బాధపడేవారికి శ‌రీరంలోని చెక్కర స్థాయిలు అదుపులోకి తీసుకువ‌స్తుంది.
రాగి ముద్దను రాగులతో తయారు చేస్తారు.కనుక రాగులలో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది.ఇక రాగి సంగ‌టి తీసుకోవడంతో ర‌క్త హీన‌త దూరం అవుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా మోతాదులో తీసుకోవడం వల్ల పిండం పెరుగుదల సవ్యంగా సాగడమే కాక,ఆ స్త్రీ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.
రాగిముద్ద జీర్ణం అవ్వడానికి సమయం పట్టినా సరే ఎలాంటి తగాదా లేకుండా జీర్ణం అవుతుంది.జీర్ణశ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంది.మ‌రియు రాగులకు చలవచేసే గుణం ఉంటుంది.కనుక దీనితో చర్మానికి హైడ్రేషన్ అంది,చర్మం అందంగా తయారవుతుంది.కావున మీరు కూడా రోజు రాగి ముద్దలు తీసుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: