కరోనా దశలవారీగా రావడానికి కారణం ఏంటో తెలుసా..?
దీనికి 4అసలైన కారణాలు వున్నాయిని చాలా అధ్యాయనాలు తెలుపుతున్నాయి.అవేంటంటే..
వైరస్ రూపం మార్చుకోవడం..
వ్యాప్తి చెందే ప్రతి దశలోనూ తన రూపం,మెటబాలిజం రేటు పెరుగుతూ ఉండడం వల్ల,దానికి తగిన మందులు కనుక్కోలేకపోతున్నారు.అంతేకాక వైరస్‌కు వ్యాప్తిచెందగల శక్తి,సామర్థ్యం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉండటం కూడా.
అనువైన అతిథి..
వైరస్ తన ఉనికి చాటుకోవాలంటే కచ్చితంగా ఒక అనువైన అతిథి కోసం అన్వేషిస్తూనే ఉంటుంది.కావున అ కరోనా వైరస్ పెంపోంది,అ వ్యాధివల్ల ముప్పులేకుండా ఉండాలంటే,ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం ద్వారా స్వీయ రక్షణ చేసుకోవాలి.లేకపోతే దానికి మనమే అనువైన అతిథులము కావడం కాయం.
సంక్రమణ సామర్థ్యం..
వైరస్ ఎంతో తెలివిగా పరివర్తన చెంది,మరింతగా సంక్రమించగల సామర్థ్యం ఉంది.ఇది సాధారణ వైరస్ ముగ్గురు వ్యక్తులకు సంక్రమిస్తే,ఈ వైరస్ ఏకంగా 13 మందికి వ్యాపించగలదు.ఇది ఎంత పరిణామంలో వ్యాపించగలదో తెలుసుకోవడం మనం ఊహించడం అసాధ్యం.ఇంతటి పరివర్తన రకాలపై పోరుకు ముందస్తు వ్యూహం సాధ్యం కాదు.కావున ఎవరికీ వారు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
అవకాశం..
ఇక నాలుగోది వైరస్ వ్యాపించడానికి మనమిచ్చే ‘అవకాశాలు ఏంటంటే.. వ్యాక్సిన్ తీసుకోకపోవడం,రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోవడం,మనమంతా కలసి కూర్చుని భోంచేయడం,మరియు హైజానిక్ గా లేని ప్రదేశాల్లో గుమిగూడటం,లేదా నాలుగ్గోడల మధ్య ఒకేచోట మాస్కులు లేకుండా కూర్చోవడం వంటివి వైరస్ వ్యాప్తికి మరిన్ని అవకాశాలిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ సమస్యలు భారత్ లో అధికంగా ఉండడం వల్లే, కరోనా దశల వారిగా మన చుట్టూ ముడుతోంది.