ఇవి తింటే బొజ్జ ఇట్టే కరిగిపోతుంది?

Purushottham Vinay
ఈ రోజుల్లో మనలో చాలా మంది కూడా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మరి కొందరు అయితే వారి బాడీ నాజూగ్గా ఉన్నా కూడా బెల్లీ ఫ్యాట్‌తో ఎంతగానో సతమతమవుతూ ఉంటారు. ఇక బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించాలంటే ఖచ్చితంగా చాలా కష్ట పడాలి.బెల్లీ ఫ్యాట్‌ని ఇంట్లోనే లభ్యమయ్యే వాటితోనే సహజంగా తగ్గించుకోవచ్చు. మరి ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.బరువును అదుపు చేయడంలో దాల్చిన చెక్క బాగా హెల్ప్ చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల తీపి పదార్థాలను తినాలన్న కోరిక కూడా అణిచి వేస్తుంది. అదనపు కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.అలాగే నల్ల మిరియాలతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ని సైతం తగ్గించవచ్చు.



నల్ల మిరియాలతో కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వు అనేది కరగడానికి హెల్ప్ చేస్తుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. మిరియాల కషాయం కూడా బాగా సహాయపడుతుంది.అసలు పసుపు లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. అంతే కాకుండా పలు రకాల సందప్రదాయాల్లో కూడా పసుపు ముందుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. పసుపు తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసు. పసుపు తీసుకోవడం వల్ల కొవ్వు కూడా కరుగుతుంది. పొట్ట ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో పసుపు బాగా హెల్ప్ చేస్తుంది.జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. జీల కర్ర తీసుకుంటే జీర్ణ క్రియ సరిగ్గా జరుగుతుంది. అదే విధంగా పొట్ట కూడా క్లీన్ అవుతుంది. ముఖ్యంగా బొడ్డు కొవ్వును తగ్గించేందుకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. జీలకర్రను నమిలి తిన్నా.. జీలకర్ర నానబెట్టిన నీటిని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: