మొహానికి ప్యాక్ లు వేసేటప్పుడు చేసే తప్పులు ఎంటో తెలుసా..?

Divya
చాలామంది మొహం అందంగా కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు న్యాచురల్ గా దొరికే పదార్థాలతో మొహానికి ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు.ఈ పాక్ లు కొంతమందికి అందాన్ని కలిగిస్తే, మరి కొంతమందికి మొహంపై బంప్ లు రావడం, మొటిమల అధికమవడం,చర్మం బ్రేకౌట్స్ కావడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.దీనికి కారణం వారు ముఖానికి ప్యాక్ లు వేసుకునేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేయడమేనని చర్మ నిపుణులు చెబుతున్నారు. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్ లు ఉపయోగిస్తుంటాం కదా.అసలు మనం ముఖానికి ప్యాక్ లు వేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తాము మనము తెలుసుకుందాం పదండి..
మొఖంపై సాధారణంగా ప్యాక్ వేసుకున్నప్పుడు చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి.ఆ సమయంలో ముఖం శుభ్రం చేసుకోకుండా ప్యాక్ వేసుకోవడం వల్ల ఆ చర్మ రంధ్రాల్లోకి మొహంపై ఉన్న బ్యాక్టీరియా మరియు మురికి చేరి మొటిమలు,మచ్చలు,బంపులు రావడం,సెభం కారడం వంటి సమస్యలను ఏర్పరుస్తాయి.కావున ఎవరైనా పేస్ ప్యాక్ లు ట్రై చేయాలి అనుకున్నప్పుడు, ఖచ్చితంగా మొహం శుభ్రం చేసుకుని,ప్యాక్ వేసుకోవడం చాలా ఉత్తమం.
ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం..
కొంతమందికి మార్కెట్లో దొరికే కొన్ని రకాల ప్యాక్ లు ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటే,మరి కొంతమందికి న్యాచురల్ పదార్థాలతో తయారు చేసుకునే చిట్కాలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి.కానీ కొంతమంది అలాకాకుండా  అన్ని చర్మాలకు ఒకే రకమైన పాకులు వేసుకోవడం వల్ల కూడా వారి చర్మం దెబ్బతిని చాలా సమస్యలను కలిగిస్తుంది.కావున మీరు కూడా ఇలా ప్యాక్ లు వేసుకోవాలి అనుకుంటే,మొదటగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది.
మాయిశ్చరైజర్ రాయకపోవడం..
చాలామంది సహజ పదార్థాలను ఉపయోగించి మొహానికి ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు.ఆ సమయంలో చర్మ రంధ్రాలు ఓపెన్ అయి ఉంటాయి.ఆ చర్మ రంద్రాలను క్లోజ్ చేయడానికి మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేసుకోవాలి.లేకపోతే ఆ రంద్రాల్లోకి మురికి,మట్టి చేరి చర్మ సమస్యలను కలిగిస్తాయి.కావున ప్రతి ఒక్కరు పేస్ ప్యాక్ ట్రై చేసేటప్పుడు,అవి వేసుకొని శుభ్రం చేసిన తర్వాత,కచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: