అనుకున్న పనులు జరగట్లేదా..అయితే ఈ సంకష్ఠ రోజు ఇలా చేసి చూడండి..!

Divya
చాలామంది చాలా రోజులుగా ఎన్నో పనులు అనుకుంటూ ఉన్నా కూడా ఆ పనులన్నీ సజావుగా జరగకపోగా,వాయిదాలు పడడం లేక ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి.ఇంకా చెప్పాలంటే కొంతమంది వ్యాపార పనులు వెనుక పడుతూ ఉంటే,ఇంకోంతమంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలాంటి వారి కోసం ఈనెల 30న వచ్చే సంకష్ట చతుర్దశి రోజున కొన్ని రకాల నివారణలు పాటించడం వల్ల వారి అనుకున్న పనులన్నీ సజావుగా జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.ఈ సంకష్ట చతుర్దశి అధిపతి అయిన విగ్నేశ్వరుడు సర్వ విఘ్నాలను తొలగించి,కోరికలు నెరవేరుస్తాడని సూచిస్తూ ఉన్నారు.అసలు సంకష్ట రోజున ఎలాంటి పనులు చేయాలో మనము తెలుసుకుందాం పదండి.

సంకష్ట చతుర్దశి అంటేనే సర్వ విఘ్నాలను తొలగించి, సర్వ పాపాలను హరించి,భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తారని చాలామంది ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు.అటువంటి భాగ్యమైన సంకష్ట చతుర్దశి  డిసెంబర్ 30వ తేదీన వస్తుంది.

ఆ రోజున ఎవరైతే అయితే వారికి అనుకున్న పనులు సజావుగా జరగాలనుకుంటారో వారు ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని,విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించుకోవాలి.ఆ తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట లలితా సహస్రనామాలు,విష్ణు నామాలు పారాయణం చేసి,ఉండ్రాళ్ళు, గరిక విగ్నేశ్వరుడికి సమర్పించుకోవాలి.ఆ తరువాతసాయంత్రం వేళ గుగ్గిలం,కర్పూరం రెండు బిర్యానీ ఆకులు తీసుకొని అంటించి ఆ వస్తున్న పొగను ఇండ్లంతా ధూపం వేయాలి.ఇలా ఇల్లంతా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మరియు శత్రుపీడలు, వేరే వాళ్ళు శాపనార్తాలు,ఏడుపులు అన్ని తొలగిపోయి క్రమక్రమంగా అనుకున్న పనులు ఒకటి తను ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తాయి.ఈ సమయంలో దేవతారాధన,బ్రహ్మచర్య పాటించడం మాంసం,మధ్యపానాలకు దూరంగా ఉండడం  వంటివి కచ్చితంగా చేయాలి.అదే రోజున ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది.

కావున అవిఘ్నేశ్వరుని కృపతో మన అనుకున్న పనులు సజావుగా జరగాలి అంటే,సంకష్ట చతుర్దశి రోజున పూజలు కచ్చితంగా నిర్వహించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: