బాలింతలు బలంగా తయారవడానికి ఉపయోగపడే ఆహారాలివే..!
మునగాకు..
స్త్రీలు డెలివరీ తర్వాత మునగాకును ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కాల్షియం,ఐరన్,ప్రొటీన్స్తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కళంగా లభిస్తాయి.ఈ మినరల్స్ తో పాటు, విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉంటాయి.ఇన్ని పోషకాలు కలిగిన మునగాకు తీసుకోవడంతో బాలింతలు తొందరగా రికవరి అవుతారు.
గోంగూర..
ఈ ఆకుకూర గర్భిణులకు చాలా ఉపయోగకారి అని చెప్పవచ్చు.ఇందులో కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, వంటి అవసరమైన పోషకాలు పుష్కళంగా లభిస్తాయి. దీనిని తరుచూ తీసుకోవడం వల్ల,ఎముకలను బలోపేతం చేస్తుంది.దీనితో వారి పొట్ట,నడుము భాగం దృఢంగా తయారవుతుంది.అంతే కాక రోగనిరోధక శక్తికూడా పెరుగుతుంది.
వెన్న అధికంగా ఉన్న ఆహారాలు..
వీటిని తీసుకోవడం వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.దీనిని బాలింతకు రోజు మొతాదులో ఇవ్వడం వల్ల బాలింతకు మరింత బలాన్ని,ఓర్పును ఇస్తుంది.
గ్రుడ్డు..
గ్రుడ్డు ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అలాగే బాలింతలకు చాలా అవసరమైన విటమిన్స్,మినరల్స్ పుష్కళంగా అంది,వారు తొందరగా రికవరీ అవడానికి దోహదపడతాయి.కావున బాలింతలకు తక్కువ ఖర్చులో,ఎక్కువ పోషకాలను అందించాలంటే,కచ్చితంగా గుడ్డును వారి ఆహారంలో చేర్చాలి.
నల్ల నువ్వులు..
వీటిలో కాల్షియం,ఐరన్,కాపర్,మెగ్నీషియం,ఫాస్పరస్ వంటి పోషకాలు ఎన్నో లభిస్తాయి.వీటిని తరుచు తీసుకోవడంతో ప్రేగు కదలికలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.మరియు శరీరానికి బలాన్నిస్తాయి.కావున బాలింతలు తొందరగా రికవరీ అవడానికి పైన చెప్పిన ఆహారాలు ఇస్తే చాలు.