ఈ విటమిన్ లోపం వల్ల కారణం లేకుండానే కోపం వస్తుందని మీకు తెలుసా..?
విటమిన్ b6 లోపం వల్ల దీర్ఘకాలిక రోగాలను సైతం వస్తాయని తెలుసు కదా.ఈ విటమిన్ మెదడుపై ప్రభావం చూపుతుంది.మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఆహారంలో విటమిన్ బీ6 ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.మన శరీరానికి కావాల్సినంత బీ6 విటమిన్ అందకపోతే కచ్చితంగా నిత్యం కోపం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాక ఈ విటమిన్ లోపం వల్ల ఎప్పుడూ అలసట, నీరసం,నిస్సత్తువా,నిరాశ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మరియు దీనితో నిరంతరం అనవసరమైన విషయాలకు చిరాకు కలుగుతుంది.ఇంకా చెప్పాలంటే విటమిన్ బీ12 లోపం ఎక్కువ ఉంటే క్రమంగా డిప్రెషన్‌కు కూడా గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వీరికి నెగటివ్ థాట్స్ ఎక్కువ అయి,సూసైడ్ ఆలోచనలు కూడా కలుగుతాయట. మరియు
ఈ విటమిన్ లోపమే కాక శరీరానికి కావాల్సినంత జింక్ లభించకపోయినా మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట.జింక్ లోపం కారణంగా, మతిమరుపు, అల్జిమర్స్,మానసిక కల్లోలం,నెగటివ్ థింకింగ్,ఆందోళన,చిరాకు,డిప్రెషన్ వంటివి చుట్టూముడతాయని నిపుణులు చెబుతున్నారు.
మరియు మెగ్నీషియం లోపం వల్ల కూడా మెదడు పనితీరు సరిగా లేక తరచు కోపం రావడం జరుగుతూ ఉంటుంది.కావున ప్రతి ఒక్కరు ఇలా కోపం తెచ్చుకుంటూ ఉంటే,వెంటనే వారి ఆహారంలో మార్పులు తప్పవు. మీరు కూడా ఇలా ఎప్పుడూ కోపపడుతున్నారా..వెంటనే పైన చెప్పిన విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.