ఐదు కంటే మించి బాదాం తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ..!
అధిక విటమిన్ ఈ..
బాదాంని 5కు మించి తినడం వల్ల విటమిన్ ఈ అనేది మొత్తాదుకు మించి మన శరీరంలోకి చేరిపోతుంది.సాధారణంగా విటమిన్ ఈ మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరస్తుంది కానీ ఓవర్ డోస్ అయితే మాత్రం మోషన్స్,పొట్టలో కూతలు,జీర్ణ సంబంధిత సమస్యలు చుట్టు ముడతాయి.అంతేకాక వీటిని ఎక్కువగా తీసుకోవడంతో నోటి సంబంధిత ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి.మరియు నాలుక, నోరు,పెదాలు,గొంతు లాంటివి ముసుకుపోయినట్లు అవుతాయి.
పోషకాల శోషణకు అడ్డంకి :
అతిగా బాదం తినడం వల్ల ఎక్కువ మొతాదులో పీచు పదార్థాలు మన శరీరంలోకి వస్తాయి.మరియు దానితో పాటుగా ఇందులో ఉన్న సైటిక్ యాసిడ్ శరీరంలో చేరుతుంది.దీనితో తిన్న ఆహారం నుంచి మన శరీరం కాల్షియం,మెగ్నీషియం,జింక్,ఐరన్ లాంటి ఖనిజాలను సరిగ్గా శోషించుకోలేదు.వీటికి తోడుగా క్యాలరీలూ ఎక్కువగా లభిస్తాయి.ఇంకా ముఖ్యంగా చలికాలంలో సాధారణంగా మనుషుల జీవక్రియరేటు తక్కువగా ఉంటుంది.ఈ సమయంలో ఎక్కువ క్యాలరీలను లోపలికి తీసుకుంటే తప్పకుండా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
మలబద్ధకం..
బాదంలో పీచు పదార్థం,పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి.వీటిని నాలుగైదు గింజలను మాత్రమే తీసుకోవడంతోనే సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.ఇవి పేగుల కదలనికను ప్రోత్సహించి సాఫీగా మలవిసర్జన జరిగేందుకు దోహదపడతాయి.కానీ స్థాయికి మించి ఎక్కువగా తింటే మాత్రం అజీర్ణం, మలబద్ధకం,పొట్ట ఉబ్బరం,ఇతర గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.కావున ప్రతి ఒక్కరూ 4నుంచి 5వరకు మాత్రమే బాదాం తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.