ఈ టేస్టీ లస్సి తాగితే చాలా హెల్తీగా ఉంటారు?

Purushottham Vinay
రుచికరమైన పైనాపిల్ పండు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఈ పండుని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.ఇంకా ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఇలా చాలా రకాలుగా పైనాపిల్ మనకు మేలు చేస్తుంది. చాలా మంది కూడా దీనిని నేరుగా తింటూ ఉంటారు.ఇంకా అలాగే జ్యూస్ చేసి తీసుకుంటారు. వీటితో పాటు పైనాపిల్ తో ఎంతో రుచిగా ఇంకా ఆరోగ్యానికి మేలు చేసే  లస్సీని కూడా తయారు చేసుకోవచ్చు. పైనాపిల్ తో చేసే ఈ లస్సీ చాలా హెల్తీగా ఇంకా రుచిగా ఉంటుంది.  ఈ లస్సీని తాగడం వల్ల  పోషకాలన్నీ చక్కగా అందుతాయి.పైనాపిల్ తో రుచిగా, కమ్మగా లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



ఈ పైనాపిల్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..మందంగా గుండ్రంగా కట్ చేసిన పండిన పైనాపిల్ ముక్కలు  4, ఉప్పు పావు టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార  2 టీ స్పూన్స్, చల్లటి కమ్మటి పెరుగు 400 ఎమ్ ఎల్, ఐస్ క్యూబ్స్ 5 తీసుకోవాలి.



పైనాపిల్ లస్సీ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు గిన్నెలో పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. ఆ తరువాత ఉప్పు, నిమ్మరసం, పంచదార వేసి బాగా కలపాలి. వీటిపై మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఆ తరువాత ఈ ముక్కలను కళాయిలో వేసి అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే దాకా వేయించాలి. ఆ ముక్కలు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తరువాత వీటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే పెరుగు, ఐస్ క్యూబ్స్ ఇంకా మరో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే పైనాపిల్ లస్సీ తయారవుతుంది.పైనాపిల్ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ లస్సీని ఖచ్చితంగా చాలా ఇష్టంగా తాగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: