అందాన్ని పెంచే సూపర్ ఇంటి చిట్కాలు?

Purushottham Vinay
ముఖాన్ని చాలా అందంగా కనిపించేలా చేయాలని ఆరాట పడుతూంటారు. అందుకోసం బ్యూటీ పార్లర్ లకి, బయట దొరికే క్రీమ్స్, లోషన్స్, ఫేస్ వాష్ లు కొంటూ అంటారు. ఇప్పుడైతే  అన్నింటినీ బయట నుంచే తెచ్చుకుంటున్నారు కానీ.. పూర్వం అయితే అన్నింటినీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుని.. ముఖాన్ని బాగా కాపాడుకునే వారు. ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే రోజుకు రెండు సార్లైనా ఫేస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ముఖంపై దుమ్ము, ధూళి ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి అలానే ఉండి.. ముఖాన్ని చాలా అందవిహీనంగా మార్చేస్తాయి. అయితే అప్పటికప్పుడు ఫేస్ లో గ్లోని తీసుకు రావడానికి మార్కెట్లో లభ్యమయ్యే క్లెన్సర్లు ఇంకా ఫేస్ వాష్ లను ఉపయోగిస్తూంటారు. అయితే వీటిలో ఎక్కువగా రసాయనాలను కలుపుతారు. వీటి వలన పింపుల్స్ ఇంకా ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి కెమికల్స్ కలిపిన ప్రోడెక్ట్స్ వాడ కుండా.. ఇంట్లో లభించే వాటితోనే క్లీన్ చేసుకోవడం వల్ల చర్మం హెల్దీగా ఇంకా గ్లోగా ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


 మీ ముఖాన్ని శుభ్ర పరుచుకోవడానికి కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ కంటే.. దోస కాయ రసం చాలా బాగా ఉపయోగ పడుతుంది. దోస కాయ రసం ముఖంలోని మురికిని ఇంకా అదనపు జిడ్డును తొలగించి.. ఫేస్ ని ఫ్రెష్ గా ఉంచేలా చేస్తుంది. ఇక దోసకాయ రసంలో, నాలు చుక్కల నిమ్మ రసాన్ని కలిపి కాటన్ సహాయంతో ముఖం అంతా బాగా పట్టించి ఆ తర్వాత నీళ్లతో కడుక్కోవాలి.అలాగే చర్మాన్ని గ్లోగా ఉంచడంలో తేనె కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చర్మంపై ఉండే బ్యాక్టీరియా ఇంకా మురికిని శుభ్రం చేసి స్కిన్ ని మెరిసేలా చేస్తుంది. కొద్దిగా తేనెను తీసుకుని మీ ముఖానికి బాగా పట్టించి.. రెండు, మూడు నిమిషాలు పాటు మృదువుగా మసాజ్ చేయాలి. తరువాత ఓ పది నిమిషాలు ఆగి.. నీటితో ముఖం బాగా క్లీన్ చేసుకోవాలి.అలాగే పెరుగు కూడా ముఖా సౌందర్యాన్ని బాగా రెట్టింపు చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. పెరుగు ముఖంపై ట్యానింగ్ ఇంకా మచ్చలను తొలగిస్తుంది. కొద్దిగా పెరుగును తీసుకుని దీన్ని ముఖం అంతా బాగా పట్టించి.. సున్నితంగా మర్దనా చేసుకుని కాసేపు ఆగి నీటితో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఫేస్ పై ఉండే ట్యాన్ ఈజీగా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: