జగన్:151 మించి గెలవబోతున్నాం..!

Pandrala Sravanthi
మే 13 అన్న ఎన్నికల ముగిశాయి. అప్పటినుంచి టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత  పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత  జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా ముందు కూడా  స్పందించలేదు. కానీ  సోషల్ మీడియాలో మాత్రం మేము గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి.  టిడిపి క్యాడర్, మరోవైపు వైసీపీ క్యాడర్  మధ్య ఇంకా చిన్న చిన్న గొడవలు నడుస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ రాయుళ్లు రెండు పార్టీలపై విపరీతమైన బెట్టింగ్ కాస్తున్నారు. అంతా నడుస్తున్న తరుణంలో  జగన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. మొత్తం వారు 151 సీట్లకు పైగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.


 జగన్ ఐ ప్యాక్ తో కాంటాక్ట్ రద్దు చేసుకున్న తర్వాత  తాజాగా ఆఫీస్ కి వెళ్ళారట. ఈ క్రమంలోనే ఆయన ఒక విషయాన్ని బయటపెట్టారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఆలోచనలో లేనన్ని సీట్లు సాధించబోతున్నామని, ఆయన చెప్పిన అంచనాలన్నీ తలకిందులు అవ్వబోతున్నాయని అన్నారు. అయితే 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ పీకేతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ 2019లో అన్ని తానే నడిపించి వైసిపిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఐప్యాక్ ఆఫీస్ కి వెళ్లి పీకే ను అభినందించారు జగన్. విధంగా ఎన్నికల స్టాటజిస్ట్ గా ఉన్న పీకే ఈమధ్య మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇదే తరుణంలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ఘోర పరాజయం పొందుతుందని తెలియజేశారు. అప్పటినుంచి వైసిపి నాయకులు అంతా పీకే పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే తరుణంలో  జగన్ ఈసారి 151 సీట్లకు పైగానే గెలిచి చూపిస్తామని పీకేకు చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. జూన్ 4న ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది అన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. త్వరలో అధికారంలోకి వచ్చి  గత ఐదేళ్ల కంటే మించిన పాలన అందిస్తామని జగన్ అన్నారు. జగన్ మాటలు చూస్తే మాత్రం ఆయన తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: