ఉత్తరాంధ్ర: రాజకీయాలకు దూరంగా ఉన్న రాజవంశస్థులు?

Purushottham Vinay
రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఉత్తరాంధ్రలోని రాజ వంశస్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. ముఖ్యంగా వీరిలో  విజయనగరం గజపతి రాజులు, బొబ్బిలి రావోస్ రాజులు, కురుపాం, మేరంగిలకు చెందిన గిరిజన రాజులు, ఇటు నర్సీపట్నం ప్రాంతానికి చెందిన తంగేడు రాజులు రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా ఉంటుంటారు.అయితే ఈమధ్య కాలంలో రాజకీయాలకు వారు దూరంగా ఉంటున్నారనే విషయం ఇండియా హెరాల్డ్ కి తెలిసింది. ఉత్తరాంధ్రలో ఒకప్పుడు రాజ కుటుంబాల వారు ఏపీలో రాజకీయాలను శాసించేవారు. అయితే ప్రస్తుతం వారి మాత్రం ప్రభావం అంతగా కనిపించడం లేదు. నిజానికి ఇప్పుడు ఉత్తరాంధ్రగా పిలుస్తున్న ప్రాంతమే ఒకప్పటి కళింగాంధ్ర. అయితే 17వ శతాబ్ధంలో ఈ ప్రాంతం కుతుబ్ షాహీల పాలనలో ఉండేది. వీరు 17 వ శతాబ్ధంలో హిందూ రాజులని ఓడించి కళింగాంధ్రని స్వాదీనం చేసుకోని పాలించేవారు. అయితే... ఆ సమయంలో కుతుబ్ షాహీలు ప్రజల నుంచి ఘోరమైన తిరుగుబాటు ఎదుర్కొన్నారు.దీంతో... ఈ తిరుగుబాటుకు గల కారణాలు తెలుసుకోమని సేనాని షేర్ మహ్మద్ ఖాన్ ను కుతుబ్ షాహీలు ఈ ప్రాంతానికి పంపించారు. అయితే... ఇక్కడ నీరు, మతం, పరిపాలన వంటి విషయాల్లో ప్రజలు చాలా అసంతృప్తిలో ఉన్నారనే విషయం తెలుసుకున్నారట.


అందువల్ల ఈ ప్రాంతంలో తాము ఓడించిన రాజవంశీకులకు తిరిగి అధికారాలు ఇచ్చి.. సుపరిపాలన అందిస్తే ప్రజల్లో తిరుగుబాటును తగ్గించవచ్చని వారు భావించారని చరిత్రని పరిశీలిస్తే తెలిసింది.ఇలా కుతుబ్ షాహీలు... బొబ్బిలి రాజులు, పూసపాటి రాజవంశం, కాకర్లపూడి, గోడె జమీందార్లు ఇంకా నర్సీపట్నం సమీపంలోని తంగేడు రాజులు, గిరిజన రాజులుగా పేరు పొందిన కురుపాం, వైరిచర్ల వంశస్తులకు కూడా జమీందారీ హాదాలని అప్పగించారు.నిజానికి ఒకప్పుడు రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా ఉన్న ఈ రాజవంశీయులంతా ఇప్పుడు అతి తక్కువ ప్రాధాన్యతను, ఆసక్తిని కలిగి ఉన్నట్లు కనిపించడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. వారసత్వ రాజకీయాల్లో ఆ కుటుంబాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఒక కారణం అని తెలుస్తుంది.అలాగే ఆయా రాజకుటుంబాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఇతర కులాలకు కేటాయించడంతో వారికి అవకాశం ఉండటం లేదని తెలుస్తుంది. అదేవిధంగా... రాజ కుటుంబాల నుంచి వచ్చిన వీరు రాజకీయాల్లో మాస్ లీడర్లుగా ఎదగలేకపోవడం కూడా మరో కారణమని తెలుస్తుంది. అందువల్ల చాలా మంది రాజవంశీకులు ప్రస్తుత రాజకీయాలకి దూరంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: