జుట్టు మెరవాలి అనుకుంటున్నారా..అయితే మందారంతో ఇలా చేసి చుడండి..!

Divya
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడానికే సమయం లేదు కదా.కానీ మనం అందంగా ఉండాలని, ముఖం,జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాము.ముఖ్యంగా జుట్టు బారుగా, మెరుస్తూ ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పులేదు.కానీ టైమ్ సరిపోక చాలామంది సహజత్కాలను పాటించలేక ఏవో కెమికల్స్ ఉన్న షాంపూలు వాడి వారి జుట్టును మరింత బలహీనంగా తయారు చేసుకుంటూ ఉంటారు.అలాంటి వారి కోసం సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.అవేలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ..
దీని కోసం ముందుగా గుప్పెడు మందారమాకులు,ఐదు నుంచి ఆరు మందారం పూలు,రెండు టీ స్పూన్ల మెంతులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టి,అందులో ఒక లీటర్ నీటిని వేసి అందులో పైన చెప్పినవన్నీ వేసి బాగా మరిగించాలి. మనము వేసిన లీటర్ నీళ్లు అర లీటర్ అయ్యేంతవరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి.అ తరువాత అందులో మనం వాడుకునే రెగ్యులర్ షాంపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ నీటిని మనం ఎప్పుడైతే స్నానం చేయాలి అనుకుంటాము అప్పుడు తలకు వేసి బాగా మర్దన చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు తలార తలస్నానం చేయడం వల్ల మన జుట్టు మృదువుగా,మెరుస్తూ ఉంటుంది.
మరియు మన జుట్టు మృదువుగా మెరుగ్గా పొడవుగా పెరగాలంటే తీసుకునే ఆహారం కూడా చాలా దోహదపడుతుంది.మన జుట్టుకు విటమిన్ ఈ మరియు విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహారాలను ఎంచుకోవడం చాలా మంచిది.మనం తాగే నీరు కూడా మన జుట్టును ప్రభావితం చేస్తుంది.కావున ప్రతి ఒక్కరు రోజుకి 5 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగి,హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.
 ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ జుట్టును బారుగా మెరుగ్గా పెంచుకోవాలి మరియు సమయం ఉండదు అనుకుంటే ఈ సింపుల్ చిట్కా ను ఉపయోగించండి చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: