సగ్గుబియ్యంతో మనం ఎక్కువగా పాయసం, కిచిడి, సగ్గుబియ్యం వడ వంటి వాటితో పాటు ఇతర వంటకాల తయారీలో కూడా వాడుతూ ఉంటాం. ఇక సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సగ్గుబియ్యంలో పోషకాలతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.సగ్గుబియ్యంతో జావను చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ సగ్గుబియ్యం జావను తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ జావను తయారు చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు అలాగే నానబెట్టుకోవాలి. తరువాత ఈ సగ్గుబియ్యాన్ని నీరంతా పోయి మెత్తగా అయ్యే దాకా ఉడికించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక గ్లాస్ వేడి పాలు, ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసి బెల్లం కరిగే దాకా కలపాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం జావ ఈజీగా తయారవుతుంది.దీనిని పొద్దున పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
ఇలా సగ్గుబియ్యం జావను తయారు చేసి తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా మారతాయి. రక్తహీనత సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా సగ్గుబియ్యం జావను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ ఇంకా మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మన శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. అయితే షుగర్ తో బాధపడే వారు ఇందులో ఇందులో బెల్లాన్ని కలపకుండా తీసుకోవాలి.ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే ఈ జావను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలాగే బలహీనత, నీరసం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారు, కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ జావను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.