పాలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే అంతేనా..?
పాలల్లో ప్రోటీన్లు,విటమిన్ ఎ,డి,బి కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం,జింక్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.పిల్లలైనా,పెద్దలైనా ఏ వయసు వారైనా పాలు తాగితే ఎంతో మంచిది.అలాగే ఫేస్ ప్యాక్ వేసుకోవడం కూడా చాలా మంచిది.
కానీ జిడ్డు చర్మం కలవారు అస్సలు పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోకూడదు.జిడ్డు చర్మం కలవారికి పాలలోని ఎంజైమ్ వల్ల మరింత జిడ్డు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దానితో ముఖముపై మొటిమలు మచ్చలు అధికంగా ఏర్పడి,ముఖమంతా గుంటలు గుంటలుగా తయారై అవకాశం ఎక్కువగా ఉంటుంది.మరియు ముఖముపై ఉన్న చర్మరంధ్రాలలో జిడ్డు పేరుకుపోయి, సెభం ఏర్పడుతుంది.కావున అధిక జిడ్డు చర్మం కలవారు పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోకుండా ఉండడమే చాలా మంచిది.
ఇకపోతే కొంతమందికి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అలాంటివారు ఏమైనా న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడటం వాడితే చాలు,ఇందులోని యాసిడ్ మరియు ఇతర సమ్మేళనాల ద్వారా సెన్సిటివ్ స్కిన్ దెబ్బతింటుంది. దానితో మొటిమలు,మచ్చలు,మృత కణాలు అధికమవుతాయి.కావున ఇలాంటి వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏవైనా ప్రొడక్ట్స్ వాడటం చాలా మంచిది. డెర్మటాలజిస్టులో అయితే వారి చర్మానికి తగ్గ ప్రొడక్ట్స్ సూచిస్తారు.కనుక వారి చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది.
ఇలాంటి చర్మం కలవారు పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోకుండా,ఇతర ప్రొడక్ట్స్ తో ఫేస్ ప్యాక్ వేసుకొని అందంగా తయారవ్వవచ్చు.పొడిచర్మం కలవారు మాత్రమే పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ట్రై చేయవచ్చు.ఇందులోని మాయిశ్చరైజింగ్ గుణాలు వారి చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.