రక్తహీనత శాశ్వతంగా దూరం అవ్వాలంటే..?

Purushottham Vinay
నేటి కాలంలో చాలా మంది కూడా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుండి ఖచ్చితంగా వీలైనంత త్వరగా బయటపడాలి. లేదంటే మనం ఖచ్చితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.అయితే ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండా న్యాచురల్ గా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. సాధారణంగా స్త్రీలల్లో హిమోగ్లోబిన్ 12 గ్రాముల నుండి 14 గ్రాముల దాకా అదే పురుషులకు 14 గ్రాముల నుండి 16 గ్రాముల దాకా ఉండాలి. రక్తం తయారవ్వాలంటే మనకు ఐరన్ చాలా అవసరం. స్త్రీలకు రోజుకు 30 మిల్లీగ్రాముల ఐరన్ అనేది అవసరమవుతుంది. ఇక పురుషులకు రోజుకు 28 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరమవుతుంది. శరీరానికి తగినంత ఐరన్ అందించడం వల్ల ఎర్ర రక్తకణాలు చాలా ఎక్కువగా తయారవుతాయి.ప్రతి రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ ను తీసుకోవాలి. జార్ లో రెండు క్యారెట్ లు, రెండు టమాటాలు, కొద్దిగా బీట్ రూట్ ఇంకా ఒక కీరదోస వేసి జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని వడక్టటి జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ లో ఎండు ఖర్జూరల పొడి ఇంకా రెండు టీ స్పూన్ల తేనె వేసి కలిపి తీసుకోవాలి.



ఇలా చేయడం వల్ల శరీరానికి కావల్సిన ఐరన్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఈజీగా లభిస్తాయి. అందువల్ల రక్తం ఎక్కువగా తయారవుతుంది. అలాగే ఈ జ్యూస్ లో ఒక టీ స్పూన్ గోధుమ గడ్డి పొడిని కూడా వేసుకుని కలిపి తాగవచ్చు. ఇక సాయంత్రం 5 గంటల సమయంలో ఏదో ఒక పండ్ల రసాన్ని మీరు తీసుకోవాలి.ఇందులో కూడా మీరు తేనె, రెండు ఖర్జూరాల పొడిని వేసి నెమ్మదిగా చప్పరిస్తూ తాగాలి. ఇంకా అలాగే సాయంత్రం భోజనం సమయంలో అన్నానికి బదులుగా 10 ఎండు ఖర్జూరాలు, అంజీరాలు ఇంకా ఎండు ద్రాక్ష వంటి వాటిని తీసుకోవాలి. అలాగే వీటితో పాటు సీజనల్ ప్రూట్స్ ను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తం అనేది ఎక్కువగా తయారవుతుంది. వీటితోపాటు ఆకుకూరలను కూడా తీసుకోవాలి.ఎందుకంటే ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ మధ్యాహ్నం ఏదో ఒక ఆకు కూరను తీసుకోవాలి. అయితే ఎక్కువగా తోటకూరను తీసుకునే ప్రయత్నం చేయాలి. మందులు వాడే పని లేకుండా ఈ విధమైన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: