వానాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే?

Purushottham Vinay
వానా కాలంలో ఖచ్చితంగా సరైన ఆహార అలవాట్లు పాటించాలి.ఆయుర్వేదం ప్రకారం ఖచ్చితంగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి.ఎందుకంటే ఈ ఆహారాలు వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వాతం, కఫ సమస్యలను తగ్గించి రోగనిరోధక శక్తిని చాలా ఈజీగా పెంచుతాయి.అందువల్ల మీ ఆహారంలో ఈ ఆహారాలను ఖచ్చితంగా మిస్ చేయకుండా చేర్చుకోండి.వర్షాకాలంలో మీ ఆహారంలో తప్పకుండా అల్లంని చేర్చుకోండి. ఇది శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే, అల్లం ఉపయోగించడం వల్ల వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఈ వర్షాకాలంలో జీర్ణక్రియ అనేది నెమ్మదిస్తుంది.అందుకే మనం వెల్లుల్లి తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.కాబట్టి మీ రోజువారీ సూప్‌లు ఇంకా పులుసులలో వెల్లుల్లిని తప్పకుండా ఉపయోగించండి.అలాగే ఈ వర్షాకాలంలో రోజూ తేనెను ఖచ్చితంగా వాడండి. వేడినీళ్లలో తేనె కలుపుకొని ఉదయాన్నే పరగడుపున తాగితే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.కాబట్టి పిల్లలకు కూడా ఖచ్చితంగా తేనె ఇవ్వండి.


అలాగే మొక్కజొన్నలో ఫైబర్, ఐరన్, విటమిన్లు కూడా ఉంటాయి. కాబట్టి వర్షాకాలంలో మొక్కజొన్న ఖచ్చితంగా తినాలి.ఇంకా అలాగే వర్షాకాలంలో మిరియాలపొడిని కూడా ఉపయోగించాలి. వేడి టీలో పెప్పర్‌మెంట్ కలుపుకొని తాగితే చాలా ఖచ్చితంగా మంచి అనుభూతిని పొందడమే కాకుండా జీవక్రియకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది వ్యాధులను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే పొట్లకాయ వర్షాకాలానికి కూడా చాలా సరి అయిన ఆహారం. దీని నుండి సూప్ తయారు చేసి తాగడం ద్వారా బరువును నియంత్రణలో ఉంటుంది.అలాగే వర్షాకాలంలో పసుపును తప్పకుండా వాడండి. ఇంకా గొంతునొప్పి, ఫ్లూ, దగ్గు, జలుబును నివారించడంలో కూడా పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.అలాగే వర్షాకాలంలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారాలలో కాకరకాయ కూడా ఒకటి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: