ఈ స్మూతిలతో బరువు తగ్గండిలా..!

Divya
సాధారణంగా బరువు తగ్గడానికి రకరకాల డైట్ లో ఫాలో చేస్తూ,నోటికి రుచి పచి లేని ఆకుకూరలు, కూరగాయలు తింటూ ఉంటారు.కొంతమందికి ఇవి క్రమంగా బోర్ కొట్టేసి డైట్లు స్టాప్ చేసేస్తూంటారు. కొద్దిరోజులు బరువు పెరగడం కొద్దిరోజులు బరువు తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి.కానీ ఎలాంటి డైట్ తోనూ కడుపు మార్చుకోకుండా,నోటికి రుచిగా కొన్ని రకాల స్మూతులతో ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు అని ఆహార నిపుణులు సూచిస్తూ ఉన్నారు.వాటితో బరువు తగ్గడమే కాకుండా,ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.అలాంటి స్మూతిలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఆపిల్ స్మూతీ..
దీనికోసం ఒక ఆపిల్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి, అందులో రెండు టీ స్పూన్ల తేనె,కొన్ని బాదం,పిస్తా పప్పు వేసి బాగా మిక్సీ పట్టి స్మూతీలాగా తయారు చేసుకోవాలి.ఇది రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుంది.ఈ స్మూతీలో ఫైబర్,విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి.ఇందులో వాడిన ఆపిల్ కొలెస్ట్రాల్ ను కరిగించి,బరువుని
తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆల్మండ్ బటర్ స్మూతి..
ఆల్మండ్ బటర్ స్మూతి అనేది,రాత్రి భోజనం స్కిప్ చేసి, దీనిని త్రాగవచ్చు.ఈ స్మూతి కోసం ఒక అరటిపండు,ఒక కప్పు బాదం పాలు,ఒక టేబుల్ స్పూన్ వెన్న,1 టేబుల్ స్పూన్ చియాసీడ్స్ వేసి మీక్సీ పట్టి తాగితే చాలు.ఇంక భోజనం చేయవలసిన పనిలేదు.ఇందులోని ప్రోటీన్స్ తొందరగా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.
చాక్లెట్ బాదం స్మూతి..
దీనికోసం రెండు ముక్కలు డార్క్ చాక్లెట్,గుప్పెడు నానబెట్టిన బాదం ,రెండు టేబుల్ స్ఫూన్ లా తేనే వేసి మీక్సీ పట్టుకోవాలి.దీనిని అల్పాహారం సమయంలో తీసుకోవడం ఉత్తమం.ఇది రుచికరమైనది మరియు పోషకమైనది కూడా.అంతేకాక ఇది బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
కాఫీ,దాల్చిన చెక్క స్మూతి..
దీనికోసం అరస్ఫూన్ కాఫీ పౌడర్,అరస్ఫూన్ దాల్చిన చెక్క పొడి,ఒక కప్పు గోరువెచ్చని పాలు,గుప్పెడు బాదాంలు,రెండు టేబుల్ స్ఫూన్ ల తేనే వేసి,బాగా మీక్సీ పట్టుకోవాలి.దీనిని తరుచూ తీసుకోవడం వల్ల, ఇందులోని ప్రొటీన్లు,సహజ చక్కెరలు,కెఫిన్ లు తొందరగా పొట్ట నిండిన భావనను కలిగించి,అధిక బరువును కంట్రోల్ లో ఉంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: