గోవాలో మద్యం ఎందుకంత చౌక?

Purushottham Vinay
మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో బీర్ల ధర తక్కువ.రాజధాని ఢిల్లీతో పోలిస్తే బీర్ల ధరలు చాలా తక్కువ. సాధారణంగా బీర్ ధర అనేది దాని బ్రాండ్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. తేడా అనేది బ్రాండ్‌ను బట్టి మారుతుంది. కానీ గోవాలో అయితే సగటు బీర్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ బీర్ ధరలు సగటున 25 శాతం తక్కువగా ఉంటాయి. అందుకే గోవాకు వచ్చి బీరు తాగేందుకు మందుబాబులు ఇష్టపడుతున్నారు.ఇక ఢిల్లీలో రూ. 130 ఉన్న కొన్ని బ్రాండ్‌ల బీర్‌ను గోవాలో రూ.90-100కి కొనుగోలు చేయవచ్చు. బాటిల్ రకం ఇంకా ప్యాకేజింగ్ ఆధారంగా ధర వ్యత్యాసం మారవచ్చు.దీనివల్ల గోవాలో బీర్ ఎంత చౌకగా ఉంటుందో  ఊహించవచ్చు.గోవాలో బీర్ చౌకగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందువలన బీర్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి పన్నుల విధానం.ఇక గోవాలో పన్ను విధానం ప్రకారం మద్యంపై పన్ను చాలా తక్కువ. దీని వల్ల ఇక్కడ బీరు ధర ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ. మన దేశంలో మద్యం జీఎస్టీ అనేది పరిధిలోకి రాదు. దీంతో మద్యం ధరలను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తోంది.


కాబట్టి అక్కడ బీరుపై పన్ను శాతం చాలా తక్కువగా ఉంటుంది.అలాగే గోవాలో మద్యం అమ్మకానికి టెండర్ పొందడం ఏం కష్టమైన పని కాదు. అందుకే ఇక్కడ మద్యం షాపులు చాలా ఎక్కువ. ఇంకా పోటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నందు వలన మద్యం ధర అనేది తక్కువగా ఉంటుంది. ఇక గోవాలో చాలా మద్యం దుకాణాలు ఉన్నాయి. మీకు కొన్ని మీటర్ల దూరంలోనే మద్యం షాపు కనిపిస్తుంది. దీని వల్ల మద్యం ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో బీర్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ప్రజలు బీర్ కోసం గోవాను సందర్శిస్తారు. ఇక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రేట్లు పెద్దగా పెంచలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో చాలా స్థానిక బ్రాండ్లు ఉన్నాయి, ఇవి సహజంగానే మద్యం ధరలను తగ్గిస్తాయి. ఇంకా అలాగే మద్యానికి అవసరమైన ముడిసరుకు కూడా ఇక్కడ చాలా సులభంగా దొరుకుతుంది. దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో ఆల్కహాల్ ఉత్పత్తి చీప్ గా ఉంటుంది. ఇక అది కూడా ధరపై ప్రభావం చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: