కిడ్నీలో రాళ్ళని పోగొట్టే చక్కటి మందు ఇదే?

Purushottham Vinay
మూత్రపిండాల్లో రాళ్ల వల్ల భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది. ఇంకా అలాగే జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఇంకా మంట వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. లేదంటే మూత్రపిండాల్లో రాళ్ల సైజు పెరిగిపోతుంది. దీంతో వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఆపరేషన్ తో అవసరం లేకుండా మూత్రపిండాల్లో రాళ్లను మనం  ఓ సూపర్ చిట్కా ద్వారా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం కూడా చాలా సులభం.ఇంకా అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.ఇక మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కొండపిండి ఆకు మనకు చాలా చక్కటి ఔషధంలా పని చేస్తుంది.ఈ కొండపిండి ఆకుతో పప్పును కూడా వండుకుని తింటారు. కొండపిండి ఆకుతో పప్పును వండుకుని తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.


మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ మొక్కను ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. కొండపిండి ఆకులను తీసుకొని వాటిని ఎండబెట్టాలి.ఆ తరువాత మెత్తని పొడిగా చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతి రోజూ ఈ పొడిని 2 టీ స్పూన్ల మోతాదులో అర గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఈజీగా కరిగిపోతాయి.ఇంకా అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. కొండపిండి ఆకులను బాగా శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి.ఇక వీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత వడకట్టుకుని గోరు వెచ్చగా అయిన తరువాత వాటిని తాగాలి. ఇలా పరగడుపున 20 రోజుల పాటు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి చాలా ఈజీగా మీరు బయటపడవచ్చు.ఇంకా అలాగే ఈ మొక్క ఆకులను నేరుగా కూడా మీరు నమిలి తినవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: