ఈ గుడి నీడ నేల మీద పడదని మీకు తెలుసా..?
1) బృహదీశ్వరాలయం విశేషాలు..
దేవాలయాలకు నెలవైన తంజావూరులోని,బృహదీశ్వరాలయంలో బోలా శంకరుడు వెలిశాడు. ఈ గుడిలోని శివలింగం మన దేశంలో అన్నిటిలోకెల్లా ఎత్తయినా శివలింగంగా పేరు పొందింది.ఈ తంజావూరు నే రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని పిలుస్తారు.మనదేశంలోని అన్ని శివాలయాలలో బృహదీశ్వరాలయం 13 అంతస్తులలో నిర్మించబడి ఉంది.ఇది నేలమట్టం నుంచి గోపురం వరకు మొత్తం అంతా గ్రానైట్ తో కట్టబడిన ఆలయం. ఎక్కడ కూడా మట్టి కానీ, సున్నం కానీ ఉపయోగించలేదు. ఈ బోలా శంకరుని ముందు మూడున్నర అడుగుల ఎత్తైన నందీశ్వరుడు వెలిశాడు.దీనిని 11వ శతాబ్దంలో,చోళుల కాలంలో రాజరాజ చోళుని ఆధ్వర్యంలో నిర్మించబడినది.
గుడిలోని మరొక ప్రత్యేక రహస్యం భక్తులు ఎంత మాట్లాడినా ఆ మాటలు ప్రతిధ్వనించవు. 11వ శతాబ్దంలోనే ఇంతటి ధ్వని పరిజ్ఞానంతో శిల్పులు నిర్మించారు. ఇక్కడ ఉన్న స్తంభాలపై మనం కొడితే, ఒక్కో స్తంభం నుంచి ఒక్కో రకమైన సంగీతం లేక లోహపు శబ్దాలు వస్తాయి. అంతే కాక ఆలయంలో కొన్ని రకాల స్వరంగ మార్గాలను నిక్షిప్తంగా తవ్వారు. బృహదీశ్వరాలయంలోని కొన్ని సొరంగ మార్గాల నుంచి తంజావూరులోని ఇతర ఆలయాలకు వెళ్లవచ్చు. మరియు ఇంకోన్ని సొరంగ మార్గాలు మరణానికి దారి చూపిస్తాయి.ఈ మార్గాలను రాజరాజ చోళుడు తనని మరియు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మార్గాలను నిర్మించాడని ప్రసిద్ధి. బ్రిటిష్ కాలంలో దేవాలయాలను నాశనం అయినా ఈ గుడిని మాత్రం నాశనం చేయలేకపోయారు. చరిత్ర కలిగిన బృహదీశ్వరాలయమును ప్రతి వ్యక్తి తప్పకుండా సందర్శించి, తమ జన్మనుధన్యం చేసుకోవాల్సిందే.