పొట్టలో పేరుకుపోయిన చెత్తని క్లీన్ చేసే టిప్?

Purushottham Vinay
నీటిని తక్కువగా తాగడం, పీచు పదార్థాలు కలిగిన ఆహారాలను తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను ఇంకా అలాగే మసాలా కలిగిన ఆహారాలను తీసుకోవడం అలాగే సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి చాలా కారణాల వలన మలబద్దకం సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంది. అందుకే ఈ మలబద్దకం సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని వల్ల గ్యాస్, కడుపులో నొప్పి, ఎసిడిటి, అజీర్తి ఇంకా అలాగే ఆకలి లేకపోవడం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మలబద్దకం సమస్య వల్ల రోజంతా కూడా చాలా చికాకుగా ఉంటుంది. ఏ పనిపైన దృష్టి సాధించలేకపోతాము.ఒళ్ళంతా బాగా బద్దకంగా ఉంటుంది.ప్రేగులు శుభ్రపడకపోవడం వల్ల మలినాలు పేరుకుపోయి చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. చాలా మంది కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి మందులను ఇంకా అలాగే సిరప్ లను చాలా వాడుతూ ఉంటారు.


 వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యను మనం సాధ్యమైనంత వరకు సహజ సిద్ద పద్దతిలో తగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి.ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాని ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి వేడి చేయాలి. వీటిని చిన్న మంటపై 5 నుండి 10 నిమిషాల దాకా బాగా మరిగించిన తరువాత ఆ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోని తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఆముదం నూనెను, అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా చిటికెడు నల్ల ఉప్పును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయం పూట పరగడుపున గోరు వెచ్చగా తాగాలి. ఈ నీటిని తాగడానికి ముందు రెండు గ్లాసుల సాధారణ గోరు వెచ్చని నీటిని ఖచ్చితంగా తాగాలి. ఇలా నీటిని తాగిన అరగంట తరువాత సోంపు గింజల నీటిని కూడా తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల మలబద్దకం సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. పొట్టలో పేరుకుపోయిన చెత్త అంతా కూడా తొలగిపోతుంది. పొట్ట బాగా శుభ్రం అవుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు ఖచ్చితంగా ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: