కీళ్లు, మోకాళ్ళ నొప్పులని తగ్గించే అద్భుతమైన టిప్?

Purushottham Vinay
కీళ్ళ నొప్పులు, మోకాళ్ల నొప్పుల వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు ఇంకా అలాగే మెట్లు ఎక్కేటప్పుడు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇటువంటి బాధాకరమైన సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే అని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, పోషకాలు కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం, అధిక బరువు ఇంకా అలాగే క్యాల్షియం లోపం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.అయితే చాలా మంది కూడా ఈ మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి మందులను, ఆయింట్ మెంట్ లను, క్యాల్షియం సప్లిమెంట్ లను ఇంకా అలాగే పెయిన్ కిల్లర్ లను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల నొప్పి తగ్గినప్పటికి వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మందులు ఏవి వాడే అవసరం లేకుండా మన ఇంట్లోనే ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా సులభంగా మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.


మోకాళ్ల నొప్పులను తగ్గించే ఈ పొడిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి..దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… ఇంకా అలాగే ఈ పొడిని ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి మనం అవిసె గింజలను, నువ్వులను ఇంకా అలాగే కాళోంజి విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మూడు పదార్థాలను సమపాళ్లల్లో తీసుకుని కళాయిలో వేసి బాగా దోరగా వేయించాలి. ఆ తరువాత వీటిని జార్ లోకి తీసుకుని బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలి.ఇక మనం ఇలా తయారు చేసుకున్న పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి.ఈ పొడిని ప్రతి రోజూ కూడా ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ పాలల్లో కలిపి తాగాలి. ఇక ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఇలా తాగిన  తరువాత వారం రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మరలా ఒక 15 రోజులు తాగాలి. ఇలా తాగడం వల్ల కీళ్ల మధ్య గుజ్జు పెరిగి శబ్దం తగ్గి అలాగే మోకాళ్ల నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: