గుండె జబ్బులు రాకుండా ఇది తినండి?

Purushottham Vinay
ఈరోజుల్లో గుండె జబ్బులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. యూత్ కూడా ఎక్కువగా హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అందుకు డాక్టర్లు ఇచ్చే మందులను కూడా తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటించడం వల్ల కూడా కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గుతుంది. ఉల్లిపాయలను రుచి కోసం ఎక్కువగా వంటల్లో వేస్తుంటారు. ఉల్లిపాయలు వేయకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. అయితే కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో ఉల్లిపాయ  చాలా బాగా మేలు చేస్తుంది.ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.అందువల్ల ఇవి చాలా ఈజీగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతాయి. దీంతో గుండె ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తినాలి. కనీసం ఒక చిన్న సైజ్ ఉల్లిపాయను అయినా రోజూ తింటే చాలు..ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.


పాత కాలంలో అయితే మన పెద్దలు ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తినేవారు. మజ్జిగ అన్నంలో నంచుకుని ఉల్లిపాయలను తినేవారు. ఇలా తినడం వల్లనే వారికి ఎలాంటి రోగాలు వచ్చేవి కావు. చాలా ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించారు. అందువల్ల ఉల్లిపాయలను రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా భాగం చేసుకోవాలి. వాటిని పచ్చిగా తింటే కొలెస్ట్రాల్‌ను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇక ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కూడా ఈజీగా కరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌ సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు. గుండె ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బీపీ కూడా ఈజీగా తగ్గుతుంది. ఇంకా రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి. అయితే ఉల్లిపాయలను పచ్చిగా తినలేమని  వారు వాటితో టీ తయారు చేసుకొని  తీసుకోవచ్చు. ఈ టీ ఎంతగానో మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: