చలి కాలంలో వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు..?

Purushottham Vinay
వెల్లుల్లి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని పరిశోధన ద్వారా తేలింది. ఏదైనా నొప్పి ఇంకా వాపు కీళ్ళు లేదా కండరాలపై కొద్దిగా వెల్లుల్లి నూనెను రాస్తే నొప్పి నుంచి చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇక వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు ఇంకా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా ముఖాన్ని బాగా శుభ్రపరుస్తాయి.ఇంకా అలాగే వెల్లుల్లి  క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుందని అందులోని చాలా బయోయాక్టివ్ అణువులు క్యాన్సర్ కణాల విస్తరణను చంపుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలలోని సమ్మేళనాలు మన ప్లేట్‌లెట్ స్టిక్కీనెస్‌ను కూడా ఈజీగా తగ్గిస్తాయి. ఇంకా అలాగే ఇవి గడ్డకట్టడాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి..ఇక పచ్చి వెల్లుల్లిని ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ సమస్యల నుండి చాలా సులభంగా ఉపశమనం పొందవచ్చు. 


ఇది కడుపులో మంటను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.అలాగే ఇది ప్రేగులకు కూడా మంచిది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పేగుల్లోని పురుగులు కూడా సులభంగా తొలగిపోతాయి. పచ్చి వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు. రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని చూర్ణం చేసి ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కాలేయం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్ ఇంకా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వైరస్‌లు, బ్యాక్టీరియా ఇంకా శిలీంధ్రాల నుండి రక్షిస్తాయి. కాబట్టి ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.వంటలకు రుచిని ఇంకా అలాగే సువాసను అందించే వెల్లుల్లిలో విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థయామిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. అధిక రక్తపోటు అనేది వివిధ అనారోగ్యాలకు మూలం. దీని ఫలితంగా గుండె పోటు, స్ట్రోక్‌ల వంటి గుండె సంబంధిత సమస్యలు ఈజీగా తలెత్తుతాయి. ఇలాంటి వారికి వెల్లుల్లి చాలా మంచి ఆహారం. ఇందులోని పోషకాలు రక్తపోటును ఈజీగా నియంత్రణలో ఉంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: