అంగవైకల్యం కూడా.. వీరి ముందు చిన్నబోయింది?
తమలో వైకల్యం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ కృంగిపోకుండా.. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో పట్టుదల ఉంటే సాధించలేని ఏదీ లేదు అని ఎంతో మంది వైకల్యాన్ని కూడా జయించి నిరూపిస్తున్నారు. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే. దివ్యాంగ దంపతులు వర్క్ కల్చర్ ను ప్రేరేపిస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు అని చెప్పాలి. మహారాష్ట్రలోని నాసిక్ లో ఒక స్టాల్ ను మూగా, చెవిటి దంపతులు పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అనే పేజ్ లో ఇక ఈ దివ్యాంగ దంపతులకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. వీడియోలో చూసుకుంటే మూగ చెవిటి, జంట పానీపూరి విక్రయిస్తూ కనిపించారు. ఇక వీరు అక్కడికి వచ్చిన కస్టమర్లకు సైగలతోనే సమాచారం అందిస్తూ ఎంతో రుచికరమైన పానీపూరీలను అందిస్తూ ఉన్నారు అని చెప్పాలి. నాసిక్ లోని అదగావ్ నాకా ప్రాంతంలో జత్ర హోటల్ సమీపంలో వీరు పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు.
ఇక వీరి దగ్గర ఎంతో రుచికరమైన పానీపూరీ దొరుకుతూ ఉండడంతో ఎంతో మంది కస్టమర్లు వీరి దగ్గరికి వస్తున్నారు అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా ఇక రుచి విషయంలో నాణ్యత విషయంలో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ దివ్యాంగ జంట కస్టమర్లను సాటిస్ఫై చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇక ఇది చూసిన ఎంతో మంది నేటిజన్లు ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. శారీరక వైకల్యం వీరి మనోభాలాన్ని ఏమాత్రం దెబ్బతీయలేదని.. ఇలాంటివారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.