మద్యం తాగాక నోరు వాసన రాకుండా ఇలా చెయ్యండి?

Purushottham Vinay
మద్యం అతిగా తాగడం మంచి అలవాటు కాదు. అయితే.. అప్పుడప్పుడు తాగేవారు తాగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. ఇది సాధారణ సమస్య. ఇలాంటివారికి మద్యం మత్తు పోతుందని ఆందోళన తప్పా వాసన గురించి పెద్దగా పట్టించుకోరు. అదే.. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు నోటి నుంచి వాసనతో ఇబ్బంది పడుతుంటారు.మద్యం సేవించిన తర్వాత దాని వాసన నోటి నుంచి త్వరగా పోదు. దీనివల్ల ఒక్కోసారి ప్రజలు సిగ్గుపడాల్సి వస్తుంది. మనం ఈ రోజు తెలుసుకునే చిన్ని చిట్కాతో మద్యం సేవించిన విషయం ఎవరికి తెలియకుండా.. తర్వాత నోటి నుంచి వచ్చే మద్యం వాసనను వదిలించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.వెల్లుల్లి, ఉల్లిపాయలతో నోటి వాసనను తొలగించుకోవచ్చు. దీని కోసం మీరు సలాడ్‌తో కలిపి ఉల్లిపాయలను తినవచ్చు. అంతే కాకుండా వెల్లుల్లిని నమలడం వల్ల ఆల్కహాల్ వాసన వెంటనే పోతుంది. అవును, బయటికి వెళ్లే ముందు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఉపయోగించకుండా.. మౌత్ వాష్‌పై పుల్లింగ్ చేయడం మంచిది.


ఎందుకంటే ఈ రెండింటి వాసన కూడా ఇతరులను ఇబ్బంది పెడుతుంది.మీరు ఆల్కహాల్ వాసనను తొలగించాలనుకుంటే.. మద్యం సేవించిన తర్వాత మౌత్ వాష్‌తో పుక్కిలించడం కూడా మంచి పరిష్కారం. ఇది మీ నోటిలో ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. అంతేకాదు వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.నోటిపూత వంటి సమస్యలకు మౌత్ వాష్ మంచి మందు అని చెప్పవచ్చు. వీలైతే, రోజూ మౌత్ వాష్‌తో పుక్కిలించడం అలవాటు చేసుకోండి.ఒక కప్పు స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తాగడం వల్ల నోటి నుంచి వచ్చే ఆల్కహాల్ వాసనను దూరం చేసుకోవచ్చు. కాఫీ వాసన చాలా బలంగా ఉన్నందు వలన మద్యం వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. మద్యం సేవించిన తరువాత మీకు దుర్వాసన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ మరిచిపోకుండా పాటించండి.ఏది ఏమైనా ఆల్కహల్ కి దూరంగా ఉండటమే ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: