లైఫ్ స్టైల్: తీపి పదార్థాలు ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుందా..?

Divya
ఈ మధ్యకాలంలో సగటున ప్రతి ఐదు మందిలో ముగ్గురు డయాబెటిస్ భారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ మహమ్మారి బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ఇక ఈ క్రమంలోని చాలామందిలో అపోహ కూడా పూర్తిస్థాయిలో పెరిగిపోతుంది.. ఇకపోతే డయాబెటిస్ బారిన పడిన వారు ఎవరైనా సరే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.. ఇక తాజా కూరగాయలు,  పండ్లు,  ఆకుకూరలు తీసుకుంటూనే ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తీపి పదార్థాలు అధికంగా ఉండేలాగా జాగ్రత్తపడితే ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది.
ఇక అధిక ఒత్తిడి , శారీరక శ్రమ లేకపోవడం వల్ల డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ముఖ్యంగా డయాబెటిస్ వచ్చినప్పుడు అత్యధికంగా రక్తంలో చక్కర శాతం ఉండడం వల్ల దాని ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై కూడా దుష్ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల కళ్ళు,  గుండె , లివర్,  నాడీ వ్యవస్థ భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉండే వారిలో క్లోమగ్రంధి పనిచేయదు. కాబట్టి వారు ఇన్సులిన్ ఇంజక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కర స్థాయిని కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇకపోతే తీపి  పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా అంటే అది కేవలం అపోహ మాత్రమే..ముఖ్యంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తినని వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వంశపారపర్యంగా కూడా ఇది వస్తుందని చెప్పవచ్చు. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి చక్కెర అధికంగా తింటే డయాబెటిస్ వస్తుంది అనే అపోహను తగ్గించుకుంటే చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ప్రతిరోజు అరగంటసేపు వ్యాయామం చేయడం ఇక ఏడాదికి ఒకసారి కళ్ళు,  పాదాలను పరీక్ష చేయించుకోవడం ఎప్పటికప్పుడు లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్,  లివర్ ఫంక్షన్ టెస్ట్ లు చేయించుకుంటూ ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: