బచ్చలి కూర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
బచ్చలి కూర అనేది మన శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర మంచి దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో ఈ బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా ఈ బచ్చలికూర దివ్యౌషధంలా పనిచేస్తుంది. హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే బచ్చలి ఆకులను రసంగా కూడా చేసుకుని తాగుతుంటే..రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.ఇంకా అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.ఈ బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు చాలా బలంగా తయారవుతాయి.


బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్ ఇంకా సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. అధిక బరువుతో బాధపడేవారికి ఈ బచ్చలికూర చక్కటి డైట్.ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం చాలా మంచిది.మూత్రంలో మంట ఇంకా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు ఈజీగా తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుందట. ఈ వేసవిలో బచ్చలి కూరను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఇంకా వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూర ఒంట్లో వేడిని చాలా ఈజీగా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: