చనిపోయాక శవాన్ని ఒంటరిగా ఉంచరు.. ఎందుకో తెలుసా?

praveen
పుట్టిన జీవి గిట్టక మానదు.. ఇది భూమి మీద ఉండే ప్రతి జీవి విషయంలో నిజం అవుతుంది అని చెప్పాలి. భూమ్మీద పుట్టి కొన్నాళ్ల మనుగడ సాధించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. అయితే ఇలా మనుషులు చనిపోయిన తర్వాత ఒక్కో మతం వారు ఒక్కో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు. అదే సమయంలో హిందూ సాంప్రదాయంలో మృతదేహాన్ని అగ్నికి అంకితం చేసి ఇక దహనం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు అంత్యక్రియలకు సంబంధించి ఇక ఎన్నో నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు.

 ఒక వ్యక్తి సూర్యాస్తమయం తర్వాత మరణిస్తే అతని యొక్క దహన సంస్కారాలు మరుసటి రోజు ఉదయాన్నే జరుగుతాయి. ఈ సమయంలోనే మృతదేహాన్ని రాత్రంతా నేలపైనే ఉంచుతారు. తప్పకుండా ఎవరో ఒకరు పక్కన ఉంటారు అని చెప్పాలి. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరినైనా దహనం చేస్తే ఇక ఆ వ్యక్తి మోక్షాన్ని పొందడట. ఇలా దహనం కోసం కూడా సరైన సమయాన్ని ఎంచుకోవాలట. గరుడ పురాణం ప్రకారం ఒకవేళ మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే దుష్ట ఆత్మ  అతని శరీరంలో చేరే అవకాశం ఉంటుందట. తద్వారా కొన్ని చెడు పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది అని గరుడ పురాణంలో ఉంది.

 అందుకే సూర్యాస్తమయంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రాత్రి అంతా నేలపై పడకోబెట్టిన సమయంలో తప్పనిసరిగా ఎవరో ఒకరు ఆ మృతదేహం పక్కనే కూర్చుంటారట. ఎప్పటికప్పుడు మృతదేహం శుభ్రంగా ఉండేలా చూసుకుంటారట. అంతేకాదు ఇక అటు మృతదేహం దగ్గర ఒక దీపం వెలిగించడానికి కారణం దుష్ట ఆత్మలు మృతదేహం లో ప్రవేశించకుండా ఉండడానికే అన్నది కూడా తెలుస్తుంది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం మృతదేహం అంతిమ సంస్కారాలు మరణించిన వారి కుమారుడు లేదా కుమార్తె నిర్వహిస్తారు. ఒకవేళ దేశ విదేశాల్లో ఉన్న వారు వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని అలాగే ఉంచు తారు. అలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది అని గరుడ పురాణంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: