పిల్లలని బలంగా ఉంచే ఆహార పదార్ధాలు?

Purushottham Vinay
పిల్లల ఆరోగ్యం తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన బాధ్యత. వారు చిన్న వయస్సులో ఆరోగ్యంగా ఉంటేనే పెద్దయ్యాక ఏ రిస్క్ లేకుండా ఉంటారు. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా వుండే బలమైన ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి.కాల్షియం అనేది శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో బాగా సహాయపడుతుంది. పిల్లలకు తగినంత కాల్షియం అందకపోతే, ఎముకలు చాలా బలహీనంగా తయారవుతాయి.ఇక ముందు ముందు పెళుసుగా మారి విరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి సక్రమంగా అందిస్తే మంచిది. వారి ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే అనేక రకాల ఆహారాలను కూడా చేర్చవచ్చు.మీ పిల్లల ఆహారంలో పాలు, పెరుగు, జున్ను చేర్చండి. వీటిని అనేక విధాలుగా కూడా తినవచ్చు.మీరు పనీర్ కూర, మిల్క్ షేక్ ఇంకా పెరుగు రైతా చేయవచ్చు. ఈ ఆహారాలలో కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది.ఇంకా బాదం చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైనది. బాదంపప్పులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది.ఇంకా మీరు పిల్లల ఆహారంలో బాదంను చేర్చవచ్చు. 


నానబెట్టిన బాదం లేదా బాదంపప్పును షేక్‌లా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు.అలాగే పిల్లల ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చండి. వాటిలో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. వాటిలో విటమిన్లు ఇంకా ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.మీరు బీన్స్, బ్రోకలీ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ని డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో క్యాల్షియం ఇంకా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే సోయాబీన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం ఇంకా ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో బాగా సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.మీరు పిల్లల ఆహారంలో సోయా పాలు ఇంకా టోఫుని కూడా చేర్చవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహార పదార్ధాలు తీసుకోండి. పిల్లలని ఆరోగ్యంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: