నడి వీధుల్లో దయ్యాలు.. అస్థి పంజరాలు..

దెయ్యాలు.. అస్థి పంజరాలంటే చాలా మంది భయపడిపోతారు. అదేంటో.. అసలు దెయ్యాలు ఉన్నాయని ఇప్పటి వరకూ నిరూపణ కాకపోయినా.. దెయ్యాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. దెయ్యాల కథలకూ చాలా డిమాండ్ ఉంటుంది. భయపడుతూనే భయాన్ని ఆస్వాదించేవారు కూడా చాలా మంది ఉంటారు.అందుకే హర్రర్‌ సినిమాలకు ఇంకా ఆదరణ ఉంటుంది.

అయితే.. ఈ దెయ్యాల భయాన్ని చాలా వింతగా సెలబ్రెట్ చేసుకునే సంబరాలు కూడా ఉన్నాయండోయ్.. మెక్సికోలో అక్టోబర్ 31న అడుగుపెడితే కొత్తవాళ్లు భయపడటం ఖాయం. ఎందుకంటే అక్కడి నగర వీధుల్లో అప్పుడు అందంగా ముస్తాబైన అస్థి పంజరాలు షికారు కొస్తాయి. దెయ్యాలు హడావిడిగా తిరుగు తుంటాయి. ప్రజలు కూడా వాటితో చేరి ఉత్సాహంగా ఊరేగుతుంటారు. అదేం అనుకుంటున్నారా.. అదంతే..

అయితే దీని వెనుక అసలు కథ తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మెక్సికన్లపై భయం స్థానంలో జాలి పుడుతుంది. 'డే ఆఫ్ ది డెడ్' అని పిలుచుకునే ఈ సందడికి దాదాపు మూడువేల సంవత్సరాల చరిత్ర ఉందట. చనిపోయిన పూర్వీకులను, పిల్లలను, స్నేహితులను తలచుకోవడమే కాదు.. వారి పరలోక ప్రయాణానికి సహాయం చేయడం కూడా ఈ పండగ ముఖ్యోద్దేశం. అంతేకాదు.. పరలోకంలో ఉన్న వారు ఒకసారి వచ్చి తమను చూడాలని కోరుకుంటారు వాళ్లు..

అందుకే సమాధులను శుభ్రం చేసి వాటిపై ఇరవై ఒక్క బంతిపూలను ఉంచుతారు. బంతిపూలే ఎందుకు? అంటే అవి ఆత్మలను ఆకర్షించడంలో ఘనమైనవని వాళ్ళ నమ్మకం. పిల్లల సమాధులపై వారికిష్టమైన ఆహార పదార్థాలు కూడా ఉంచుతారు. మెక్సికన్లు ఏ దేశాల్లో ఉన్నా ఈ పండగను కచ్చి తంగా చేసుకుని తీరతారట. చాలా సంస్కృతుల్లో ఇలాంటి ఆచారమున్నా.. మూడు రోజుల పాటూ పిల్లలను, పెద్దలను, స్నేహితులను తలచుకుంటూ చేసుకోవడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు. ఏమంటారు. మన దగ్గర కూడా ఇలాంటి ఆచారాలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి మీకు తెలిస్తే.. కామెంట్ చేయండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: