లైఫ్ స్టైల్: రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఇవే..!!

Divya
ఇటీవల కాలంలో నూటికి ముప్పై మంది మహిళలు ఎక్కువగా రొమ్ముక్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. సాధారణంగా మనం పుట్టినప్పటి నుంచి రుతుక్రమం వచ్చే వరకు స్త్రీ శరీరంలో అసంఖ్యాకమైన మార్పులకు లోనవుతుంది అని అందరికీ తెలిసిందే. దీంతో వారు వివిధ ఆరోగ్య మార్పులకు కూడా గురి అవ్వాల్సి ఉంటుంది. 2020 వ సంవత్సరంలో జరిపిన నివేదికల ప్రకారం 8.8 మిలియన్ల మంది మహిళలు క్యాన్సర్ బారిన పడినట్టు సమాచారం. ఇక చిన్న మొటిమ అయినా లేదా ఊదా రంగులో ఉండే రొమ్ము  అయినా.. చర్మంపై పొలుసులుగా.. రక్తం కారుతున్న పాచ్ లు చర్మం పైన ఇలా కొన్ని రోజులలో అవి తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సందర్శించి రోగ నిర్ధారణ చికిత్స చేయించుకోవాలి.
చాలామంది రొమ్ములపై చిన్నపాటి గడ్డలు వచ్చినా సరే వాటిని తేలికగా తీసుకుంటూ ఉంటారు.. కాలక్రమేణా మానిపోతాయి అని కూడా అనుకుంటారు. ఒక్కోసారి ఇవి ప్రాణాంతక క్యాన్సర్ కి కారణం కావచ్చు అని గ్రహించాలి. ముఖ్యంగా ఈ సమస్యను మీరు ఆలస్యం చేస్తే మరింత ప్రాణాపాయం అని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. వెన్నునొప్పి అంటేనే మహిళలలో వేధించే అతి పెద్ద సమస్య అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఋతుస్రావం మొదలై మోనోపాజ్ వరకు స్త్రీలు ప్రతి నెల ఇలా వెన్నునొప్పి అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో వచ్చే తిమ్మిరి వల్ల వచ్చే నొప్పిని కూడా భరించలేక పోతారు. పెల్విస్,  వీపు దగ్గర దీర్ఘకాలికంగా ఉండే నొప్పులు క్యాన్సర్ కి సంకేతాలు కాబట్టి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బొడ్డు పై ప్రాంతంలో నొప్పి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు సంకేతమట. వెన్నెముకలలో కణితి దిగువ, వీపులో భయంకరమైన నొప్పి కూడా వస్తుంది.. తరచుగా మలబద్ధకం లేదా పేగు సిండ్రోమ్ తో గందరగోళం చెందే పరిస్థితులు కూడా మనం క్యాన్సర్ గా భావించాలి. ఇక మహిళలు బహిష్టు సమయంలో పేగులలో మార్పులు,  మలబద్ధకం,  ఉబ్బరం , నీరసం,  బరువు తగ్గడం, మలం రంగులో మార్పులు ఇలా పలు లక్షణాలు కనుక ఎక్కువ కాలం కొనసాగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: