మీ ఆధార్ లో ఈ తప్పులున్నాయా... ఏం పర్వాలేదా ?

VAMSI
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ ను తప్పక కలిగి ఉండాలి. దాదాపు అన్ని పనులకూ ఆధార్ అనేది తప్పనిసరి అయిపోయింది. అడ్రెస్స్ ప్రూఫ్ కోసం, ఏజ్, నేటివిటీ, ఇలా అన్నిటికీ ఆధార్ అనేది ప్రదానం. ఈ ఎం ఐ లు తీసుకోవాలి అన్నా, లోన్ లు గట్రా ఇలా ఎన్నో వాటికి ఆధార్ కార్డ్ కావాల్సిందే. అయితే ఆధార్ కార్డ్ లో కనుక సదరు వ్యక్తి వివరాలు సరిగా లేకపోతే ఇబ్బందుల పాలు కావాల్సిందే.  అయితే చాలా మందికి ఆధార్ కార్డ్ లో సరైన వివరాలు పలు సాంకేతిక లోపాలు, మరియు పలు కారణాల వలన కరెక్ట్ వివరాలు నమోదు అయి ఉండవు. పేరులో అక్షర దోషాలు, గుర్తు పట్టలేకుండా ఉండే ఫోటోలు, అడ్రస్‌లో మార్పులు ఇలాంటి సమస్యలు చాలానే ఉంటాయి.
అయితే వివరాలు సరిగా ఉంటే కానీ పనులు కావు.
అలాంటప్పుడు ఇక ఆధార్ కార్డ్ లో వివరాలు సరి చేసుకోవడానికి జనాలు వాటిని పట్టుకుని  ఆధార్ సెంటర్లకు , తహసిల్దార్ ఆఫీసర్ వంటి వారి దగ్గరకు పరుగులు తీస్తుంటారు. అయినా అందరికీ పనులు జరగవు. ఇలా ఆధార్ కార్డ్ కోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాగా  ఇలాంటి వారి కోసం సరికొత్త  సర్వీసును అందుబాటులోకి తీసుకు రానున్నది ప్రభుత్వం. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి ఆధార్ నంబర్‌ను మొబైల్ నంబర్‌లతో లింక్ చేయడం, వారి వివరాలను అప్‌డేట్ చేయడం, అలాగే ఈ తరహా వాటిని అప్డేట్ చేయడం వంటి పనులను ఇక నుంచి పోస్ట్‌మ్యాన్లు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందు కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48,000 మంది పోస్ట్‌మెన్‌లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఇప్పటికే శిక్షణనిస్తోంది.
అంతే కాకుండా వారికి తమ  విధులను సక్రమంగా నిర్వర్తించడానికి అవసరం అయినా  కార్డ్ హోల్డర్‌, ల్యాప్ ట్యాప్, డెస్క్ ట్యాప్ వంటి అవసరమైన వాటిని పోస్ట్‌మెన్‌లకి ఇచ్చేందుకు సర్వం సిద్దం చేస్తోంది సర్కారు.   పోస్టుమెన్‌లతో పాటు ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క కామన్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్న దాదాపు 13,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను కూడా ఇందు కోసం అదనంగా  వినియోగించనున్నట్లు చెబుతున్నారు. తద్వారా అందరికీ అందుబాటులో సర్వీసులు ఉంటాయని త్వరగా పనులు పూర్తి అవుతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: