ఫోన్ ఎత్తగానే 'హలో' అని ఎందుకు అంటారు.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మొబైల్ రంగంలో కూడా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం మనకు కావాల్సిన అన్ని పనులు కూడా మొబైల్ లోనే జరిగిపోతున్నాయి. అలెగ్జాండర్ గ్రహంబెల్ కనుగొన్న టెలిఫోన్ దగ్గర నుంచి ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ వరకు కూడా ఎన్నో మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు గంటల తరబడి మొబైల్ వాడుతున్నారు. మొబైల్ తోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. అంతే కాదు దేశ విదేశాల్లో  ఉన్న వారితో సైతం ఎంతో సులభంగా ఉన్నచోటునుంచి మాట్లాడగలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఎక్కడి వరకు అంతా బాగానే ఉన్నా మొబైల్ గురించి ఒక సీక్రెట్ మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సాధారణంగా మొబైల్  లో ఎవరైనా కాల్ చేసినప్పుడు కాల్ ఎత్తగానే హలో అని అంటూ ఉంటాం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఇక ప్రతి ఒక్కరూ ఫోన్ ఎత్తగానే హలో అని పదం అంటారు అని చెప్పాలి. మరి ఇలా హలో అనే పదం ఎందుకు వచ్చింది హలో అనకుండా  వేరే పదం ఎందుకు అనరు.. అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఇలా ఫోన్ ఎత్తగానే హలో అనడానికి ఒక ప్రత్యేకమైన కారణంఉందట. మొదట టెలిఫోన్ కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహంబెల్ సుదీర్ఘ శ్రమ తర్వాత అద్భుతమైన ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టెలిఫోన్ కనిపెట్టిన తర్వాత మొదటిసారి అది రింగ్ అయ్యి అవతలివాళ్ళు ఫోన్ ఎత్తగానే గ్రహంబెల్ హలో అని అన్నారట. అయితే ఇది గ్రహంబెల్ గర్ల్ ఫ్రెండ్ పేరు కావడం గమనార్హం. ఆమె పేరు మార్గరెట్ హలో. ఇక గ్రహంబెల్ ఆమెను ముద్దుగా హలో అని పిలుచుకునే వారట. అయితే ఇలా ఆయన ఫోన్ ఎత్తిన మొదటిసారి హలో అనడంతో ఇక ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా అదే కంటిన్యూ చేయడం మొదలు పెట్టారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: