లైఫ్ స్టైల్: డయాబెటిస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

Divya
సాధారణంగా ఒకసారి డయాబెటిస్ మన శరీరంలోకి ఆవహించింది అంటే కచ్చితంగా జీవితాంతం మందులు మాత్రలతోనే గడపాల్సి ఉంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలికి అనుగుణంగా శరీరంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో డయాబెటిస్ వ్యాధి కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇటీవల కాలంలో వయస్సులో సంబంధం లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరిలో కూడా సాధారణ వ్యాధిగా మారిపోయింది డయాబెటిస్. కానీ ఎవరికి అయితే ఈ సమస్య వచ్చిందో జీవితకాలం పాటు మధుమేహం సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తోంది అని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని మనం డయాబెటిస్ అని అంటారు. ఇక ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల శరీరంలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక డయాబెటిస్ వచ్చినప్పుడు పొడి గొంతు లేదా తరచుగా దాహం వేయడం, మూత్ర విసర్జన , కంటిచూపు మందగించడం,  కారణం లేకుండా బరువు పెరగడం లేదా తగ్గడం, నీరసంగా అనిపించడం ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాదు అధికంగా ఆకలి వేయడం కూడా డయాబెటిస్ కు ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు. అందుకే డయాబెటిస్ సమస్య ముదరక ముందే సమస్యను గుర్తించి జీవన విధానంలో మార్పులు చేసుకుంటే డయాబెటిస్ ను అరికట్టవచ్చు.
ముఖ్యంగా డయాబెటిస్ ను  అదుపులో ఉంచుకోవాలి అంటే ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవడానికి గింజలు, పండ్లు,  మొలకెత్తిన వాటిని ఎక్కువగా తినాలి. మానసిక ఆందోళన,  ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి .. సమయం దొరికినప్పుడల్లా నచ్చిన వారితో కాలం గడపాలి. అలాగే శ్వాస సంబంధ వ్యాయామం చేయడం వల్ల ఎటువంటి సమస్యనైనా మనం దూరం చేసుకోవచ్చు. ఫలితంగా డయాబెటిస్ అదుపులో కూడా ఉంటుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: